ఫోటో మూవీ ద్వారా తెలుగు చిత్రసీమకు హీరోయిన్ గా అడుగుపెట్టి ఆ మూవీతో ప్రేక్షకుల నుండి మంచి పేరు అందుకున్న నటి అంజలి. ఆ తరువాత లవ్ ఇన్ షాపింగ్ మాల్ మూవీ కూడా ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది. డబ్బింగ్ మూవీ గా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయం అందుకుంది. ఇక అక్కడి నుండి ఇటు తెలుగు, అటు తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన అంజలికి సూపర్ స్టార్ మహెష్, విక్టరీ వెంకటేష్ లు కలిసి తొలిసారిగా నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని సీత పాత్ర ఎంతో గొప్ప క్రేజ్ తెచ్చిపెట్టింది.
అప్పటిలో ఆ మూవీ పెద్ద విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తన కెరీర్ లో అక్కడక్కడా కొన్ని ప్రత్యేక పాత్రలతో పాటు ప్రత్యేక గీతాల్లో కూడా ఆడిపాడి ఆడియన్స్ మనసు దోచుకున్న అంజలి కెరీర్ మంచిగా ఎదుగుతున్న సమయంలో తన కుటుంబ సభ్యుల నుండి పలు వేధింపులు ఎదుర్కొన్నారు. తన పిన్ని అయిన భారతీ దేవి, అలానే తమిళ డైరెక్టర్ కళాంజియం ఇద్దరూ కూడా తాను కష్టపడి సంపాదించిన కోట్ల డబ్బును దుర్వినియోగం చేయడంతో పాటు తనను ఎన్నో విధాలుగా వేధింపులకు గురిచేశారని అప్పట్లో అంజలి వారిద్దరి మీద కేసు పెట్టడం జరిగింది.

అయితే ఈ విషయమై ఆమె పిన్ని భారతీ దేవి మాట్లాడుతూ, నిజానికి అంజలి తన సోదరి బిడ్డ అని, మొదటి నుండి తనని ఎంతో చక్కగా చూసుకున్నాం అని, అయితే ఆమె చెప్తున్నట్లుగా మేము తన నుండి కోట్లు దోచుకోవడానికి ఆమె దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంది, లక్షలు కూడా లేవు అంటూ విమర్శలు చేసారు. అప్పట్లో ఎంతో సంచలనం రేపిన ఈ వివాదం తరువాత వారి నుండి విడిగా ఉంటున్న అంజలి ఇకపై తన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నానని, అలానే తనకు ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదని, అయితే తన మీద లేనిపోని నిందలు వేసి ఆంక్షలు విధించడం మాత్రం నచ్చలేదని అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక ప్రస్తుతం అంజలి వరుసగా సినిమా అవకాశాలతో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: