పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ప్రస్తుతం తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఇటీవల ఒక మీడియా ఛానెల్ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ళ పాటు శ్రమించి ఈ కథని రాసుకున్నాను అని తెలిపారు. అయితే కథ, కథనం పూర్తి చేసుకున్న అనంతరం ప్రభాస్ కి వినిపించడం అది ఆయనకి విపరీతంగా నచ్చడంతో మూవీని పట్టాలెక్కించడం జరిగిందని అన్నారు.

1970ల కాలం నాడు యూరోప్ లో జరిగిన కథ కావడంతో సెట్స్ పరంగా ఎంతో ఖర్చు చేయాల్సి వచ్చిందని, అలానే కరోనాకి ముందు కొన్నాళ్ల పాటు యూరోప్ లో పలు కీలక సీన్స్ తీసాం అని తప్పకుండా రిలీజ్ తరువాత మూవీ పెద్ద సక్సెస్ కొడుతుందనే నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు. రొమాంటిక్ యాక్షన్ తో కూడిన లవ్ కం ఎమోషనల్ జర్నీ మూవీగా ఎంతో అత్యద్భుతమైన విజువల్ వండర్ గా తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ లో ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర చేస్తుండగా ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే కనిపించనున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ వాస్తవానికి సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కావాల్సి ఉండగా ప్రస్తుతం మన దేశంలో వరుసగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో కొన్నాళ్ల పాటు తమ సినిమాని వాయిదా వేసినట్లు కొద్దిసేపటి క్రితం రాధేశ్యామ్ యూనిట్ ప్రకటించింది.

దానితో ఈ మూవీ కోసం ఎప్పటినుండో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురయ్యారు. నిజానికి రాధేశ్యామ్ మూవీ అసలు ఎప్పుడో రిలీజ్ కావాల్సిందని, ఇటీవల డిసెంబర్ మధ్యలో వచ్చిన పుష్ప మాదిరిగా ఈ మూవీని కూడా అదే సమయంలో రిలీజ్ చేసి ఉంటె ఇప్పుడు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా అని కొందరు ఫ్యాన్స్ సోషల్ మేడి మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తుంటే, మరికొందరేమో మొత్తం నిర్మాతలైన యువి క్రియేషన్స్ వారే చేసారని, సినిమాని ఎప్పటి నుండో ఎంతో సాగదీస్తూ తీయడంతో పాటు రిలీజ్ డేట్ ని కూడా సడన్ గా అనౌన్స్ చేసారని, దానితో ఎప్పటినుండో సినిమాపై అందరికీ ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడడం జరిగిందని, ఇక ఇప్పుడు సడన్ గా కరోనా కారణంగా థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గించారని వాయిదా వేస్తున్నాం అని చెప్పడం ఎంతవకు కరెక్ట్ అని నిర్మాతలని ఉద్దేశించి మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి రాధేశ్యామ్ మూవీ తదుపరి ఎప్పుడు రిలీజ్ అనౌన్స్ చేస్త్తారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: