టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్క హీరోయిన్ కూడా స్టార్ హీరోయిన్ కావాలనే కలలు కంటూ ఉంటుంది. సరైన టైంలో సరైన సినిమా పడితే ఆ సినిమా కు తగ్గ నటన సదరు హీరోయిన్ ప్రదర్శిస్తే తప్పకుండా హీరోయిన్ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ విధంగా ఎంతో మంది హీరోయిన్ లు తమకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుని ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ లకు డిమాండ్ ఎంతలా పెరిగిపోయింది అంటే కొంతమంది హీరోలు హీరోయిన్ కావాలని చెప్పి ఆమె కోసం కొన్ని నెలలు అయినా ఎదురు చూడడానికి వెనకాడడం లేదు.

ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్ ల కోసం మన హీరోలు ఎదురుచూసి వారితోనే సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు సాధించి ఆ హీరోయిన్ ల అభిమానుల అభిమానాన్ని కూడా పొందుతున్నారు. అలా టాలీవుడ్ లో తళుక్కున మెరిసి మంచి మంచి అవకాశాలు రాబట్టుకున్న నిధి అగర్వాల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అందాల నిధి గా ఆమె అభిమానులు ఆమెను పిలుచుకుంటూ ఉంటారు. తొలి సినిమా నుంచి గ్లామర్ పరంగా నటన పరంగా అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మంచి విజయాన్ని అందుకొని అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది.

అయితే హిట్టు పడిన కూడా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాలు రాకపోవడం ఆమె అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. ఇష్మార్ట్ శంకర్ సినిమా తో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావించింది. కానీ ఆమెకు ఇక్కడ కంటే ఎక్కువ అవకాశాలు రావడం పట్ల అందరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు. ఏదైతేనేం నిధి అగర్వాల్ తెరమీద కనిపిస్తే చాలు అనుకునే అభిమానులు ఆమెను తమిళ సినిమాల్లో చూసి తమని తాము సంపాదించుకుంటున్నారు మరి ఆమె అందాలకు ఫిదా అయిన దర్శక నిర్మాతలు ఆమెకు తమ సినిమాలలో చాన్సులు ఇస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: