మాస్ మహారాజా రవితేజ హీరోగా 1999 డిసెంబర్ 3న నీకోసం అనే సినిమా  రిలీజయింది.ఇక ఈ సినిమా  శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కింది.నీకోసం అనే ఈ సినిమాలో హీరోయిన్ గా మహేశ్వరీ నటించింది.ప్రాణానికి ప్రాణం అనే సినిమాకి తాతినేని రామారావు డైరెక్షన్ వహించారు. అయితే అప్పుడు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన శ్రీను వైట్ల అప్పుడే నీకోసం మూవీ కథ కు శ్రీకారం చుట్టాడు.ఇకపోతే ప్రాణానికి ప్రాణం డిజాస్టర్ కావడంతో  అందులోని   తప్పొప్పులు సరిచేసుకొని కథను రూపొందించుకున్నాడు.  ఇకపోతే అదే సమయంలో  సాగర్ దగ్గర శ్రీనువైట్ల అసిస్టెంట్ గా చేస్తున్నాడు. ఇక దీని తర్వాత  సత్యనారాయణ దగ్గర అసిస్టెంట్ గా చేసాడు. పని నేర్చుకున్న శ్రీనువైట్ల నీకోసం మూవీ స్క్రిప్ట్ మరింత కట్టుదిట్టంగా మార్చాడు.

ఇకపోతే శ్రీనువైట్ల రాంగోపాల్ వర్మ దగ్గర కూడా పని చేయడం జరిగింది ఆ సమయంలోనే రవితేజ శ్రీను వైట్ల కు పరిచయం అయ్యాడు. అయితే శ్రీను వైట్ల జెడి చక్రవర్తితో నీకోసం సినిమాను చేయాలనుకున్నాడు కానీ ఆలోచనలో పడ్డాడు. డి జె డి తో సినిమా చేయడం కష్టం అనిపించింది శ్రీను వైట్లకి. ఇక మరోవైపు శ్రీనువైట్ల కి డాక్టర్ రాజశేఖర్, సాక్షి శివానంద్ జంటగా అపరిచితుడు సినిమాను చేసే అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల షూటింగ్ ఆగిపోవడం జరిగింది. అయితే 40 లక్షలతో ఈ సినిమా చేయడానికి ఒక నిర్మాత దొరికాడు. దానితో రవితేజను హీరో గా పెట్టారు. అయితే ఈ సినిమాను 28 రోజుల్లో పూర్తి చేయాలని అనుకున్నారు.

కానీ ఈ సినిమా చేయడానికి 8 నెలలు పట్టింది. ఆర్ పి పట్నాయక్ సినిమాకి మ్యూజిక్ అందించారు. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ అని అనుకున్నారు. ఇక ఆఖరికి ఈ సినిమా 55 లక్షల రూపాయలతో పూర్తి కావడం జరిగింది. అయితే 80 లక్షలకు ఈ సినిమాను రామోజీ కొన్నారు. అలా హిట్ కొట్టాడు శ్రీను వైట్ల. దాని తర్వాత రామోజీ రావు తన బ్యానర్ పై ఆనందం అనే సినిమా చేయడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత రవితేజ ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం అనే సినిమాతో బిజీ గా మారాడు. ఆఖరికి నాగార్జున సలహాలతో సినిమాలో కామెడీని జోడించి సినిమాలు తీస్తూ స్టార్ డైరెక్టర్ గా మారాడు శ్రీను వైట్ల...!!

మరింత సమాచారం తెలుసుకోండి: