మత్తెక్కించే కళ్ళు, చక్కటి ఆహార్యం ఒక్క మాటలో చెప్పాలంటే ఆరుడగుల అందం ఆమె సొంతం ఆమె ఎవరో కాదు నటి అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తనదైన స్టైల్లో నటించి తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. అనతి కాలంలోనే సినీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరి అందరినీ అబ్బురపరిచింది. హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ లోనే కాదు అరుంధతి, బాహుబలి వంటి చిత్రాల్లోనూ విభిన్న పాత్రల్లో నటించి తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. పాత్ర ఏదైనా అందరూ మెచ్చేలా నటించడం ఆమె స్పెషాలిటీ. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలకు ఈ మధ్య కాస్త దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

అనుష్క లైఫ్ స్టైల్ గురించి ఇపుడు కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం...

అనుష్క శెట్టి నవంబర్ 7 , 1981 లో కర్ణాటక లోనిమంగలురు లో జన్మించారు. ఈమె వయసు 41.  ఈమెను సన్నిహితులు స్వీటీ అని, మాక్ అని ముద్దుగా పిలుస్తుంటారు. అనుష్క తొలుత సినీ యాక్టర్ కావాలని అనుకోలేదు, అసలు ఊహించలేదు అని ఆమె పలుమార్లు కొన్ని ఇంటర్వ్యూ లలో చెప్పారు. ఈమె ప్రాథమిక విద్య అంతా బెంగుళూర్ లోని బాల్డ్విన్ గర్ల్స్ హై స్కూల్ లో జరిగింది. చిన్నప్పుడు స్వీటీ చాలా అల్లరి చేసేవారట. స్కూలింగ్ తరువాత ఆమె బెంగుళూర్ లోనే మౌంట్ కార్మెల్ కాలేజ్ లో చదివారు. కాలేజీ సమయంలో అనుష్క వెంట చాలా కుర్రాళ్లు వెంట పడ్డారట. అయితే ఈ అందాల బంగారు లేడీ మాత్రం ఎవరికీ చిక్కలేదు. అందుకే చాలా మంది హీరోయిన్ లకు లవ్ ఎఫైర్ లు ఉన్నా... అనుషాక్ మాత్రం ఎటువంటి ఎఫైర్ లేదు.  అంత పర్ఫెక్ట్ గా తన పర్సనల్ లైఫ్ ను మైంటైన్ చేస్తోంది.

స్వీటీ బ్యాచిలర్ పూర్తి చేసి పట్టా పొందారు.  అనంతరం తాను నేర్చుకున్న తనకు నచ్చిన యోగాను తన ప్రొఫెషన్ గా ఎంచుకుని ముంబైలో ఒక యోగా సెంటర్ ను ప్రారంభించారు అనుష్క . అప్పట్లో ఒక వ్యక్తికి యోగా నేర్పించడానికి నెలకు 200 నుండి 300 వరకు తీసుకునేవారట. అయితే అనూహ్యంగా అక్కినేని నాగార్జున సూపర్ చిత్రంలో అవకాశం రావడంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.  మొదట్లో 7.85 లక్షల పారితోషకంతో అనుష్క సినీ కెరియర్ ను ప్రారంభించగా బాహుబలి సినిమాకు 3.50 కోట్లు అలాగే బాహుబలి 2 సినిమాకు 5 కోట్ల వరకు పారితోషకం పుచ్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: