తెలుగు చిత్ర పరిశ్రమ లో పెద్ద సినిమాల విడుదల అనేది అందరినీ ఆలోచనలో పడ వేసింది.. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదా పడటం వల్ల మిగిలిన సినిమాలు అన్నీ కూడా వాయిదా పడ్డాయి.. జనవరి 7న విడుదల కావలసిన ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ‏తో ఈ సినిమా ఏ రేంజ్ ‏లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు మేకర్స్. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.


ఆర్ ఆర్ ఆర్ సినిమా కొత్త తలనొప్పి వచ్చి పడింది. సినిమా విడుదల నిలిపివేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరాని కి చెందిన అల్లూరి సౌమ్య ఆర్ఆర్ఆర్ హైకోర్టు లో పిల్ దాఖలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని, ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల పై స్టే ఇవ్వాలని పిటిషనర్‌ ను ఆమె కోరారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం వద్దకు వెళ్ళింది ఈ పిల్.


ఈ విడుదల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూన్న ఫ్యాన్స్ కు ఇది భారీ షాక్ అనే చెప్పాలి. ఇద్దరు టాప్ హీరోలు కావడం తో జక్కన్న తెరకెక్కించిన చిత్రం కావడం తో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా విడుదల సందిగ్దం లో పడింది. ఈ సినిమా విడుదల తర్వాత మిగిలిన సినిమాలు పరిస్థితి గంధర గొలంగా మారింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా విడుదల కాకుంటే మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న గా మారింది. ప్రభాస్ సినిమాకు ఇది భారీ షాక్ అనే చెప్పాలి. ఇది ఇలా ఉండగా హీరో నాగర్జున ఏపి సర్కార్ కు మద్దతు ఇవ్వడం చర్చలకు దారి తీసింది..


మరింత సమాచారం తెలుసుకోండి: