సమంత సినిమాల్లో చాలా స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్ ప్లే చేసింది. కానీ నాగచైతన్యతో విడిపోయాక చాలా భయపడిందట. చనిపోతానేమో అనే డౌట్స్‌ కూడా వచ్చాయని చెబుతోంది. కానీ విడాకుల ద్వారా డిప్రెషన్‌లోకి వెళ్లిపోకుండా తనని తాను స్ట్రాంగ్‌గా బిల్డ్‌ చేసుకుంది. ఇప్పుడు దక్షిణాదితో పాటు 'ఎరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్' స్టోరీతో ఇంగ్లీష్‌ మార్కెట్‌లోనూ అడుగుపెడుతోంది. సెలబ్రిటీస్ డిప్రెషన్‌ గురించి మాట్లాడ్డానికి కూడా వెనకాడుతోన్న రోజుల్లో దీపిక పదుకొణే ఈ సమస్యని ప్రస్తావించింది. మెంటల్‌ హెల్త్‌కి అధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పింది. సరైన ట్రీట్‌మెంట్‌ తీసుకుని ఈ సమస్య నుంచి బయటపడాలని చెప్పింది. రణ్‌బీర్‌ కపూర్‌తో బ్రేకప్‌ అయ్యాక దీపిక డిప్రెషన్‌లోకి వెళ్లిందని చెప్తారు.

తెలుగు, హిందీలో సక్సెస్‌ ఫుల్‌ కెరీర్ చూసిన ఇలియాన కూడా డిప్రెషన్‌లోకి వెళ్లింది. బాడీ డిస్మార్ఫిక్ డిసార్డర్‌తో మానసిక కుంగుబాటుకు గురైంది ఇలియాన. ఈ డిసార్డర్ ఎక్కువై పోయి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుందట. అయితే ఆ తర్వాత ట్రీట్మెంట్‌ తీసుకోవడంతో, ఈ సమస్య నుంచి బయటపడ్డానని చెప్పింది ఇల్లీ.పాయల్ రాజ్‌పుత్ 'ఆర్.ఎక్స్.100'తో స్టార్డమ్‌ సంపాదించుకుంది గానీ, అంతకుముందు ఆరేళ్లు చాలా కష్టాలు పడింది. ముంబాయిలో ఎన్ని ఆడిషన్స్‌ ఇచ్చినా ఆఫర్స్‌ రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఒకసారి సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకుందట పాయల్. అయితే ఆ తర్వాత డిప్రెషన్‌ నుంచి బయటపడి, 'ఆర్.ఎక్స్.100'తో కెరీర్‌ సెట్‌ చేసుకుంది పాయల్.

హీరోయిన్స్‌కి ఒక్క హిట్ పడితే చాలు కెరీర్‌ సెట్‌ అయిపోతుందని అంతా అనుకుంటారు. కానీ వాళ్లకి స్టార్డమ్‌ వచ్చినా, చేతినిండా ఆఫర్స్ ఉన్నా వాళ్లకుండే సమస్యలు వాళ్లకుంటాయి. ముఖ్యంగా పర్సనల్ ఇష్యూస్‌ చాలామంది హీరోయిన్స్‌ని కుంగదీస్తుంటాయి. సౌత్‌లో నయనతార లేడీ సూపర్ స్టార్. తెలుగు, తమిళ్, మళయాళంలో బోల్డంత ఫాలోయింగ్ ఉంది. అయితే ఇది ప్రస్తుతం. పాస్ట్‌లో ఈమెకి ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ఉంది. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ సాడ్‌ పార్ట్‌ కూడా ఉంది. ప్రభుదేవాతో రిలేషన్‌షిప్ బ్రేకప్ అయ్యాక నయన్‌ డిప్రెషన్‌లోకి వెళ్లింది. అయితే మళ్లీ సినిమాల్లో బిజీ అయి ఈ ఆలోచనల నుంచి బయటపడింది నయన్. ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేష్‌ శివన్‌తో కలిసి కొత్త లైఫ్‌ స్టార్ట్ చేసింది. శ్రుతీ హాసన్‌ 'కాటమరాయుడు' తర్వాత కొన్నాళ్లు సినిమాలకి దూరమైంది. అప్పుడు చాలామంది శ్రుతి, మైఖెల్ కోర్సలేని పెళ్లి చేసుకుంటోంది అందుకే సినిమాలకి గ్యాప్‌ ఇచ్చిందని అంతా అనుకున్నారు. కానీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్‌ని రిపేర్ చేసుకోవడానికే శ్రుతి బ్రేక్ తీసుకుందట. ఒక ఏడాది గ్యాప్‌లో బాడీ అండ్ మైండ్‌కి కోఆర్డినేషన్‌ కరెక్ట్‌గా ఉండేలా చూసుకొని, మళ్లీ సినిమాలతో బిజీ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: