లెటేస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి..ఒక్క సినిమాతో తన తల రాతను మార్చుంటూ..వేరే హీరోయిన్స్ జాతకాని కూడా మార్చేసిన కన్నడ బ్యూటి. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ విషయం అందుకున్న ఈ చిన్నది..రీసెంట్ గా శ్యాం సింగ రాయ్ తో మరో తిరుగులేని విజయాని అందుకుంది. దీంతో అమ్మడుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ కృతి తెలివిగా ఆలోచించి తన కెరీర్ కి ప్లస్ అయ్యే సినిమాలను..ఢిఫరెంట్ లుక్ లో కనిపించే పాత్రలను మాత్రమే సెలక్ట్ చేసుకుని..అప్పుడే స్టార్ హీరోయిన్ల విధంగా ఆలోచిస్తుంది.

ఇక రీసెంట్ గా నాని తో శ్యాం సింగరాయ్ సినిమాలో నటించిన కృతి నటనకు జనాలు ఎలాంటి  రివ్యూ ఇచ్చారో తెలిసిందే. రెండో సినిమా కి కూడా ఇంతటి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుందంటే కృతి అందాలకు కుర్రాళ్లు ఎంత ఫ్లాట్ అయ్యారో అర్ధమైపోతుంది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి నానితో కొన్ని హాట్ సీన్స్ చేసి దిమ్మతిరిగే షాకిచ్చింది. నిజానికి రెండో సినిమాకే పాప ఈ రేంజ్ లో రెచ్చిపోతుందని ఎవ్వరు ఊహించలేదు.  సినిమా కధ మలుపు తిరిగేది ఆ సీన్ తోనే కావడంతో కృతి నానితో బెడ్ సీన్స్ కి ఓకే చెప్పిందట.

అయితే అలా చేయడానికి మాత్రం  కొన్ని కండీషన్స్ పెట్టిందట. నానితో బెడ్ సీన్స్ చేసేటప్పుడు..అక్కడ ఎవ్వరు ఉండకూడదని..కేవలం డైరెక్టర్..కెమారా మెన్ మాత్రమే ఉండాలని కోరిందత. అంతేకాదు ఆమె పెట్టిన ఎక్స్ ప్రేషన్స్ కొంచెం అటు ఇటు గా ఉన్నా ఫైనల్ చేయాలని..మరీ హాట్ ఎక్స్ ప్రేషన్స్ నే కావాలని బలవంతం చేయకూడదని డైరెక్టర్ తో ముందే చెప్పిందట. ఇక ఈ కండీషన్స్ కి ఓకే చెప్పిన డైరెక్టర్..ఆమె కోరుకున్న విధంగానే ఆమె కు కంపర్టబుల్ ఉన్న విధంగానే సీన్స్ తెరకెక్కించారట. ఇక సినిమా విడుదల అయ్యాక ఈ సీన్స్ చూసి నెటిజన్స్ కృతి మహా ముదురు..చిన్న వయసులోనే ఇలాంటి హాట్ ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చింది అనే కామెంట్స్ చేసారు. అయితే డైరెక్టర్స్ మాత్రం ఆమెలోని టాలెంట్ చూసి వరుస ఆఫార్లు ఇస్తున్నారు. ప్రస్తుతం అమ్మడు చేతిలో అరడజన్ సినిమాలు పైగానే ఉన్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: