సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాగో పెద్ద సినిమాలు విడుదల అవ్వడం లేదు కాబట్టి చిన్న చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికి టికెట్ల రేట్లు తగ్గింపు.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతంగా వ్యాపిస్తున్న సమయంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు అయినటువంటి ఆర్ ఆర్ ఆర్ తో పాటు రాధే శ్యామ్ సినిమాని కూడా సంక్రాంతి పోటీ నుంచి నిర్మాతలు తప్పించడం జరిగింది. అందులోనూ టికెట్ల రేట్లు అంతంత మాత్రంగా ఉండటం ..పలుచోట్ల సినిమా థియేటర్లు మూత పడటంతో సినిమా విడుదల చేస్తే నష్టం చూడక తప్పదు అని నిర్ణయించుకున్న దర్శక నిర్మాతలు సినిమాల విడుదలలు వాయిదా వేశారు.

ఈ నేపథ్యంలోనే సంక్రాంతి బరిలో చిన్న చిన్న సినిమాలతో పాటు ఇతర భాషా చిత్రాల సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతున్నాయి. ఇక ఆ సినిమాలు కూడా సంక్రాంతి పండుగకు రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఏ భాష నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయ్యి.. సంక్రాంతి పండుగకు విడుదల అవుతున్నాయో ఆ సినిమాల గురించి ఒకసారి మనం చదివి తెలుసుకుందాం. సంక్రాంతి బరిలో డబ్బింగ్ అల్లుళ్ళము మేము వస్తున్నాము అంటూ ఎవరెవరు అంటున్నారో కూడా ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. వాలిమై:తమిళ్ సూపర్ స్టార్ హీరో అజిత్ నటించిన వాలిమై సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో మన తెలుగు యంగ్ హీరో కార్తికేయ విలన్ గా చేయడం మరో విశేషం. తెలుగు ,తమిళ్ ,హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది.

2. సామాన్యుడు:తమిళ్ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న సామాన్యుడు సినిమా జనవరి 14 వ తేదీన సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ తమిళ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల కావడం గమనార్హం.

3. సెల్యూట్:మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన భూమిక గా నటించిన సినిమా సెల్యూట్. ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదల కానుంది.

4. నాపేరు శివ 2:తమిళ్ హీరో కార్తి అప్పట్లో చేసిన మద్రాస్ సినిమాని ఇప్పుడు తెలుగులో నా పేరు శివ 2 గా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీని అయితే ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: