యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగునాట నటుడిగా ఎంతో క్రేజ్ అందుకున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు అంటే నిజంగా అది కేవలం ఆయన నటనను చూసి మాత్రమే అని చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన 30కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా ఆయన ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసి తన అభిమానులను ఎంతగానో అలరించేవారు. అయితే ప్రతి నటుడికి ఒడిదుడుకులు ఉన్నట్టు కూడా ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి.

ఒకానొక సమయంలో ఆయనకు వరుస ప్లాపులు ఎదురవుతున్న సమయంలో ఎంతో ఓర్పుగా మళ్ళీ మంచి సినిమాలను ఎంపిక చేసుకుని విజయాల బాట పట్టారు. ఇప్పుడు టాప్ ఫైవ్ టాలీవుడ్ హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు గా ఉండడం నిజంగా మంచి విశేషం అనే చెప్పాలి. ఇతర భాషలలో సైతం ఎన్టీఆర్ తన ప్రతిభ చూపే విధంగా తన సినిమాలను అక్కడ విడుదల చేయగా ఆయన చాలా వరకు మంచి రెస్పాన్స్ అందుకోగా కొన్ని సినిమాల విషయంలో భారీ ఫ్లాప్ లను అందుకున్నారు. అందులోనూ తెలుగులో సూపర్ హిట్ అయిన మూడు చిత్రాలు ఇతర భాషలలో ఘోరమైన ఫ్లాప్ లు గా మిగిలాయి. 

తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ ను హీరోగా నిలబెట్టిన ఆది సినిమా ఆయనకు మంచి మాస్ ఇమేజ్ తీసుకు వచ్చి సూపర్ హిట్ గా నిలచేలా చేయగా ఈ సినిమాను తమిళంలో ప్రశాంత్ హీరోగా చేయగా అక్కడ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇక సింహాద్రి సినిమా కూడా తమిళంలో విజయ్ కాంత్ హీరోగా చేయగా అక్కడ అది భారీ ఫ్లాప్ గా నిలిచిపోయింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తమిళంలో చేయగా అది కూడా బాక్సాఫీస్ వద్ద భారీగా నిరాశపరిచింది.అలా ఎన్టీఆర్ నటించిన మూడు సూపర్ హిట్ సినిమాలు ఇతర భాషలలో మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేక పోయింది. ఈ సినిమాలలో ఎన్టీఆర్ హీరో కాకపోవడమే విషయం కావచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: