కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు మన హీరోలు. అంతేకాదు దేశవ్యాప్తంగా చాలా మంది హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకులను ఇప్పటివరకు అలరిస్తూ రాగా సీనియర్ హీరోలు అయిన తర్వాత కూడా వారు కుర్ర హీరోలలా ప్రవర్తిస్తూ ఒకేసారి రెండు మూడు సినిమాలు ఒకే రోజున రెండు మూడు కాల్షీట్ల షూటింగ్ లు చేస్తూ యువ హీరోలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు.  ఆ విధంగా వయసు తో సంబంధం లేకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాను సెట్స్ మీద కు తీసుకు వెళ్లడం ఒక్కసారిగా మెగా అభిమానులను ఎంతగానో సంతోషపరుస్తోంది. ఇతర హీరోల అభిమానులను మాత్రం ఇది ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులోనే మెగాస్టార్ చిరంజీవి ఇన్ని సినిమాలలో నటించడం నిజంగా ఎవరికైనా ఆశ్చర్యకరమే అని చెప్పవచ్చు. ఇక అక్కినేని నాగార్జున కూడా ఐదు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ తాను తగ్గేది లేదు అని నిరూపించుకుంటున్నారు. ఇటు బాలకృష్ణ మరియు వెంకటేశ్ లు కూడా ఈ ఐదు పదుల వయస్సు దాటిన తర్వాత కూడా వరుస సినిమాలలో తన వయసుకు తగ్గ పాత్రలో నటిస్తూ అందరినీ ఎంతగానో ఆకర్షిస్తున్నారు. 

ఇక మలయాళ హీరో మమ్ముట్టి మరియు మోహన్ లాల్ లు కూడా మన తెలుగు సీనియర్ హీరోలకు ఏ మాత్రం తగ్గని విధంగా వరుస సినిమాలు చేస్తూ తమ లాంగ్వేజ్ లో శభాష్ అనిపించుకుంటున్నారు. తమ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆదరిస్తున్నారని చెప్పొచ్చు. తమిళనాట సీనియర్ హీరోలు గా ఉన్న రజనీకాంత్ మరియు కమల్ హాసన్ లు కూడా అక్కడ వరుస సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ షారుక్ ఖాన్ వంటి హీరోలు కూడా 50 ఏళ్ల పైబడిన వారే. వీరందరూ కూడా సినిమా పై ఇంట్రెస్ట్ ఉంటే ఏజ్ పెద్ద విషయం కాదని నిరుపిస్తూ వరుసగా సినిమాలను చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: