శ్రీ రెడ్డి.. సోషల్ మీడియా కి పరిచయం అవసరం లేని పేరు. గత మూడు నాలుగేళ్ల నుంచి ఈ పేరు తెలుగు జనాల నోళ్లలో నానుతూనే ఉంది. అసలు ఎవ్వరికి తెలియని ఈ శ్రీ రెడ్డి ఒక్కసారిగా కాంట్రవర్సీ క్వీన్ గా మారి మీడియాలోనూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఎంతలా అంటే శ్రీ రెడ్డి ఏం చేసినా, ఏం మాట్లాడినా కూడా వినేందుకు రెడీ అయ్యే అభిమానులు కూడా ఉన్నారు ఇప్పుడు. సినిమాల గురించి అయినా కావచ్చు రాజకీయాల గురించి అయినా కావచ్చు తన మనసులో ఏముందో దాన్ని సూటిగా బోల్డ్ గా చెబుతూ కుండబద్దలు కొట్టేస్తూ ఉంటుంది.

ఇక యూట్యూబ్లో ఆమె వీడియోలకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇక శ్రీ రెడ్డి హైదరాబాద్ తో పాటు అప్పుడప్పుడు చెన్నైలో కూడా ఉంటుంది. దీంతో ఆమె ఆస్తులను బాగా కూడా పెట్టుకుందని.. ఆమెకి ఖరీదైన అపార్ట్మెంట్లు, కార్లు కూడా ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. అయితే వీటిపై ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది శ్రీ రెడ్డి.ఇక ఆ ఇంటర్వ్యూ శ్రీరెడ్డిని యాంకర్ అడుగుతూ..' మీకు హైదరాబాద్లో రెండు డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ తోపాటు బీఎండబ్ల్యూ, ఆడి కార్లు ఉన్నాయట కదా? అని ప్రశ్నించాడు. అయితే ఈ ప్రశ్నకు శ్రీరెడ్డి సమాధానమిస్తూ..' తనకు హైదరాబాదులో సొంత ఇల్లు మాత్రమే ఉందని.. ఇక ఓ ఆడి కారు కూడా ఉందని తెలిపింది.

అంతేకానీ మిగిలిన ఆస్తులు ఏవీ లేవని అన్నారు. ఇక తాను ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఇల్లు ఓ అపార్ట్ మెంట్ లో చాలా చిన్నది అని చెప్పింది. ఇక ఈ మధ్య కాలంలో తాను సంపాదించింది కూడా ఏం లేదని తెలిపింది. తల్లిదండ్రుల సపోర్ట్ లేని అమ్మాయిలకు కనీసం సొంత ఇల్లు అయినా ఉండాలని, రేపటి రోజున ఎవడో ఒకడు వచ్చి నువ్వు అలా ఇలా చేస్తున్నావ్ వెంటనే ఇల్లు ఖాళీ చేయి అని అనిపించుకునే బాధ ఉండదని వెల్లడించింది. ఇక ఇంట్లో తాను చాలా స్వేచ్ఛగా ఉంటానని.. తనకు నచ్చిన పాటలు వేసుకుంటాను అని.. ఇక రాజకీయ పార్టీల విషయంలో కాంట్రవర్సీ కామెంట్ కూడా చేస్తూ ఉంటాం అని చెప్పింది. ఇలాంటి సమయంలో రాను అద్దెకు ఉంటే కచ్చితంగా ఆ ఇంటిని ఖాళీ చేస్తారని అందుకే సొంత ఇల్లు ఉండాలి అని చెప్పింది శ్రీ రెడ్డి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: