సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక వింత ప్రపంచం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఒక్కోసారి అనుకోకుండానే అదృష్టం తలుపు తడుతూ ఉంటుంది. ఇక మరికొన్ని సార్లు వద్దనుకున్నా దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఒకప్పుడు అగ్ర హీరోయిన్లుగా ఇండస్ట్రీని ఏలిన వాళ్లకు ఇప్పుడు అసలు అవకాశాలు రావడం లేదు. అదే హీరోల విషయానికి వస్తే వాళ్లకు 60 ప్లస్ వచ్చినా.. వాళ్ళ వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా.. ఆ హీరోలు ఇండస్ట్రీలో ఇప్పుడు సత్తా చాటుతున్నారు.

అయితే హీరోయిన్స్ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి అగ్ర హీరోయిన్స్ రమ్యకృష్ణ, మీనా లాంటివాళ్ళు తమ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్నారు. అయితే ఆ తర్వాత తరం హీరోయిన్స్ గా వచ్చిన కాజల్ అగర్వాల్, శ్రీయా శరణ్, త్రిష, తమన్నా లాంటి అప్పటి స్టార్ హీరోయిన్ల క్రేజ్ మాత్రం క్రమ క్రమంగా తగ్గిపోతుంది. ఈ భామలకి అవకాశాలు కూడా పెద్దగా ఏమీ రావడం లేదు. పైగా స్పెషల్ సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్స్ లో అయితే మాత్రం ఛాన్స్ లు ఇస్తున్నారు.

ఇక బాలీవుడ్ లో చూసుకుంటే మాధురి దీక్షిత్, రవీనా టాండన్, శిల్పా శెట్టి లాంటి వాళ్ళు కేవలం బుల్లితెరపై రియాలిటీ షో స్ లో మాత్రమే కనిపిస్తున్నారు. ఇక సుస్మిత సేన్, రాణి ముఖర్జీ లాంటి వాళ్లు కూడా అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తున్నారు. ఇక మరోవైపు కరిష్మా కపూర్, ఐశ్వర్య రాయ్, జాహి చావ్లా లాంటి వాళ్ళు 90 వ దశకంలో హీరోయిన్స్ గా సత్తా చాటి ఇప్పుడు అవకాశాలు రాక అలాగే ఉండిపోతున్నారు. ఇక కత్రినా కైఫ్, దీపికా పదుకునే కరీనా కపూర్ లాంటి వాళ్లు మాత్రం 40 కి చేరువవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్స్ గా కంటిన్యూ అవుతున్నారు. మొత్తానికి హీరోయిన్ల వయసు 40 దాటితే వాళ్ళకి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావన్నమాట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: