అసలైతే శుక్రవారం అంటే రేపు ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ హంగామా ఉండాల్సింది. పాన్ ఇండియా సినిమాగా ఆర్.ఆర్.ఆర్ వరల్డ్ వైడ్ భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ వయిదా పడటం అందరికి షాక్ ఇచ్చింది. దేశంలో కరోనా ఉదృతి పెరగడం వల్ల ఆర్.ఆర్.ఆర్ చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ తర్వాత రావాల్సిన ఆచార్య సినిమా కూడా వాయిదా వేస్తున్నట్టు టాక్.

ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ఆచార్యకి సంబంధం ఏంటి అంటే.. రెండు సినిమాల్లో చరణ్ ఉన్నాడు. ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు చరణ్. ఆచార్యలో సిద్ధ పాత్రలో కనిపించనున్నాడు. మెగా ప్లాన్ ప్రకారం ముందు ఆర్.ఆర్.ఆర్ ఆ తర్వాతనే ఆచార్య అని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. అందుకే ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యే వరకు ఆచార్యని హోల్డ్ లో ఉంచారు. ఆర్.ఆర్.ఆర్ లో ఎలాగు చరణ్ అదరగొట్టేస్తాడు. ఆ సినిమా ఇంప్యాక్ట్ కూడా ఆచార్యకు ప్లస్ అవుతుందనే కారణంతో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాతనే ఆచార్య అనుకున్నారు.

ఇప్పుడు జనవరి 7న రావాల్సిన ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ పోన్ కాగా.. ఆచార్య ఫిబ్రవరి 4న రిలీజ్ అనుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవ్వాలంటే జూలై వరకు వెయిట్ చేయక తప్పదు. మరి ఇప్పటికీ ట్రిపుల్ ఆర్ తర్వాతే ఆచార్య తెచ్చే ఆలోచనతో ఆచార్యని కూడా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ కి షిఫ్ట్ చేస్తారా లేక ఆర్.ఆర్.ఆర్ తో సంబంధం లేకుండా ఆచార్యని సోలోగా రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ఇప్పటివరకు రిలీజైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య రెండు సినిమాలతో చరణ్ తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: