టాలీవుడ్ లో ప్రస్తుతం ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒకరు తమ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంటే.. మరొకరు తమ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు భామలు అంటే ఒకరు కృతి శెట్టి కాగా మరొకరు నిధి అగర్వాల్. ఉప్పెన సినిమాతో ఫస్ట్ మూవీతోనే ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది కృతి శెట్టి. ఈమధ్యనే శ్యాం సింగ రాయ్ సినిమా కూడా హిట్ అవడంతో అమ్మడు లక్కీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సంక్రాంతికి బంగార్రాజు సినిమాతో సందడి చేయనుంది కృతి శెట్టి.

నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో కృతి శెట్టి తన క్యూట్ లుక్స్ తో ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తుంది. ఇక మరోపక్క సంక్రాంతికి మహేష్ మేనల్లుడు గల్ల అశోక్ హీరోగా వస్తున హీరో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నిధి అగర్వాల్ బ్లాక్ అండ్ బ్లాక్ శారీలో అందాలతో అదరగొడుతుంది. ఇస్మార్ట్ బ్యూటీ నిధి తన బోల్డ్ అటెంప్ట్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలని చూస్తుంది.

రెండు సినిమాల ప్రమోషన్స్ లో కృతి శెట్టి ఏమో తన క్యూట్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంటే.. నిధి మాత్రం సెంటరా ఎట్రాక్షన్ గా ఉండాలని హాట్ లుక్స్ తో అలరిస్తుంది. సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ లో ఇద్దరు భామలు తమ ప్రెజెన్స్ తో గ్లామర్ అందిస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో సంక్రాంతి హిట్ ఎవరికి పడుతుందో చూడాలి. కృతి శెట్టికి హిట్టు పడితే మాత్రం ఇది హ్యాట్రిక్ అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నిధి చేస్తున్న హీరో సినిమా కొత్త కుర్రాడు కాబట్టి ఆమె వల్లే సినిమాకు క్రేజ్ వచ్చేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: