బంగార్రాజు సినిమా ఫంక్షన్లో నాగార్జున వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్లు పడుతున్నాయి. మరోవైపు ఎగ్జిబిటర్లు కూడా ఆయన వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. మొత్తంగా సోషల్ మీడియాలో నాగార్జున ట్రెండింగ్ టాపిక్ గా మారారు. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా అది ఆయనకు, ఆయన సినిమాకు కలిసొచ్చే అంశమే. అయితే అంతలోనే చిరంజీవి హైలెట్ అయ్యారు. నాగార్జున భారాన్ని, ట్రోలింగ్ ని ఆయన కొంత పంచుకున్నారు.

అసలు ఆచార్య సినిమా విడుదల ఇప్పుడు కాదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, పెద్ద సినిమాలన్నీ వెనక్కు వెళ్లిపోయాక, ఆచార్య కూడా అలానే డైలమాలో పడింది. కానీ అనుకోకుండా ఆచార్య లైమ్ లైట్లోకి వచ్చింది. ఆచార్య సినిమాలో పాట విడుదల చేయడమే దీనికి కారణం. పాట రిలీజైన తర్వాత అందులో పదాలు బాగోలేవని ఆర్ఎంపీ సంఘాలన్నీ గొడవకు దిగాయి. తెలంగాణ, ఏపీలో కూడా వారు నిరసనలు తెలియజేస్తూ రోడ్లెక్కుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.

నిన్న మొన్నటి వరకూ సినిమా టికెట్ల వ్యవహారం హైలెట్ అయింది, ఆ తర్వాత నాగార్జున స్పీచ్ హాట్ టాపిక్ అయింది, తాజాగా చిరంజీవి ఆ స్థానాన్ని భర్తీ చేశారు. చిరంజీవి ఆచార్య సినిమాలో పాట ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. మరి ఆచార్య టీమ్ ఇప్పటి వరకూ దీనిపై స్పందించలేదు.

ఆర్ఎంపీలు ఏం చేయబోతున్నారు..?
సినిమాలో పాట లిరిక్స్ మార్చాలని ఆర్ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఆచార్య టీమ్ ని అదే కోరుతున్నారు. నిర్మాత కానీ, దర్శకుడు కానీ ఇంకా స్పందించలేదు. చిరంజీవి కూడా సోషల్ మీడియాలో దీనిపై రియాక్ట్ కాలేదు. ఈ దశలో ఆర్ఎంపీ వైద్యులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తారా లేక సోషల్ మీడియాని వేదికగా మార్చుకుంటారా అనేది తేలాల్సి ఉంది.
ఇప్పటి వరకూ నాగార్జున ట్రోలింగ్ ఎదుర్కుంటే.. ఇప్పుడు చిరంజీవి ఆ ట్రోలింగ్ కి బలవుతున్నారు. మొత్తమ్మీద పూర్తిగా టాపిక్ బంగార్రాజు నుంచి పక్కకు తొలిగింది. ఇప్పుడు ఆచార్యపై పడింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: