సంక్రాంతి భారీ సినిమాలు వాయిదా పడినప్పటికీ ఫిబ్రవరిలో విడుదల అవ్వాలని భావిస్తున్న ‘ఆచార్య’ మూవీ ప్రమోషన్ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఈ నెలాఖరకు ఇండియాలో థర్డ్ వేవ్ పీక్ కు చేరుకుంటుంది అన్నసంకేతాలు వస్తున్నప్పటికీ ఆవిషయాలను పట్టించుకోకుండా ‘ఆచార్య’ మూవీ మ్యానియాను పెంచడానికి ఈమూవీ టీమ్ విడుదల చేసిన ఐటమ్ సాంగ్ మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడ బాగా నచ్చింది.


67 సంవత్సరాల వయసులో చిరంజీవి యంగ్ హీరోలతో సమానంగా వేసిన స్టెప్స్ ఈపాటకు హైలెట్ గా మారాయి. దీనితో ఈపాటకు రికార్డ్ స్థాయిలో హిట్స్ వస్తున్నాయి. అయితే ఈపాట పై కూడ ట్రోలింగ్ తప్పలేదు. ఈ పాట ట్యూన్ కాపీ అంటూ కొందరు ఈమూవీ సంగీత దర్శకుడు మణి శర్మను టార్గెట్ చేస్తున్నారు.


బాలీవుడ్ లో 1985 లో వచ్చిన ‘జిలేలే జిలేలే’ ట్యూన్ ను ఈపాట పల్లవి కోసం మణిశర్మ కాపీ కొట్టాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెలోడీ బ్రహ్మ గా గుర్తింపు పొందిన మణిశర్మ గతంలో చిరంజీవికి ఎన్నో హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ అభిమానంతోనే చిరంజీవి కొరటాల శివను ఒప్పించి ‘ఆచార్య’ మూవీకి సంగీత దర్శకుడుగా అవకాశం ఇచ్చాడు అని అంటారు. చిరంజీవి తనపై ఉంచిన నమ్మకం వమ్ము చేయకుండా ‘లాహే లాహే’ సాంగ్ ను అద్బుతంగా ట్యూన్ చేయడంతో మణిశర్మకు మంచి ప్రశంసలు వచ్చాయి.


అయితే ఐటమ్ సాంగ్ విషయానికి వచ్చేసరికి మణి శర్మ ఇప్పటి తరం అభిరుచులను సరిగ్గా క్యాచ్ చేయలేకపోయాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. పరిస్థితులు ఇలా ఉంటే కొనసాగుతున్న కోవిడ్ పరిస్థితులు వల్ల ఫిబ్రవరిలో ‘ఆచార్య’ విడుదల ఉండకపోవచ్చు అన్నసంకేతాలు వస్తున్నాయి. ఈ మూవీ కూడ తిరిగి సమ్మర్ రేస్ పై దృష్టి పెట్టే ఆస్కారం ఉండటంతో సమ్మర్ కు ఎన్ని భారీ సినిమాలు విడుదల అవుతాయో ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: