అతి తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. సైడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. పెళ్లి చూపులు సినిమాతో విజయ్ తన సక్సెస్ జర్నీని స్టార్ట్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమా తన జీవితాన్నే మార్చేసింది. గీతా గోవిందం, టాక్సీవాలా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు విజయ్ కెరియర్‌నే మార్చేశాయి. ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతూ.. బిజీ షెడ్యూల్స్ తో దూసుకెళ్తున్నారు. యూత్ హీరోగా మంచి పాపులారిటీని కూడా సంపాదించుకున్నారు.


ప్రస్తుతం విజయ్ దేవరకొండ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్‌కు ఫ్యాన్ ఫాలొయింగ్ భారీగా పెరిగింది. అభిమానుల నుంచి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు విజయ్ దేవరకొండ యాక్టింగ్‌ అంతే చాలా ఇష్టం. ఇదే విషయాన్ని చాలా మంది సెలబ్రిటీలు ఆయా సందర్భాల్లో వెల్లడించారు. తాజాగా ప్రముఖ సింగర్ హేమచంద్ర సతీమణి, గాయని శ్రావణ భార్గవి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తను విజయ దేవరకొండకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు. కాగా, సింగర్ శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రముఖ గాయకుడు హేమచంద్రను ప్రేమించి పెళ్లి చూసుకుంది. ఇద్దరిదీ సేమ్ ప్రొఫెషనల్ కావడంతో భర్తతో కలిసి పలు టీవీ షోలల్లో పాల్గొంటారు.


శ్రావణ భార్గవి పాటలు పాడటమే కాదు.. రెండు, మూడు పాటలు కూడా రాశారంట. రమణ గోగుల నిర్మించిన ‘బోణీ’ సినిమాలో ప్లేబ్యాక్ సింగర్‌గా తన కెరియర్‌ను స్టార్ట్ చేసిన భార్గవి.. సింహా సినిమాలోని ‘సింహమంటీ చిన్నోడే వేటకొచ్చాడే’ పాటతో మంచి పేరును తెచ్చుకుంది. కాగా, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భార్గవి పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో నెటిజన్స్ ఒక వేళ మీరు హీరోయిన్‌గా చేస్తే హీరోగా ఎవరినీ సెలక్ట్ చేసుకుంటారని, మీ భర్త పేరు చెప్పవద్దని కండీషన్ కూడా పెట్టారు. దీనికి ఆమె హేమచంద్ర పేరు తీయనని, నా ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పుకొచ్చారు. హీరోయిన్‌గా ఛాన్స్ వస్తే తనతో కలిసి నటిస్తానని పేర్కొన్నారు. అలాగే తనకు హీరోయిన్లలో సాయిపల్లవి ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: