ఆర్ఆర్ఆర్ మూవీపై దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే మంచి అంచనాలే ఉన్నా ఇవాళ విడుద‌ల కావాల్సిన రిలీజ్ వాయిదాప‌డినా చిత్ర బృందం మాత్రం అద‌రెక బెద‌ర‌క ఉంది.కానీ అభిమానులంతా చాలా అంటే చాలా ఒత్తిడిలో ఉన్నారు.దీంతో థియేట‌ర్ల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి త‌మ హీరోల‌కు అభినంద‌న‌లు చెప్ప‌డ‌మే కాదు ధైర్య వ‌చ‌నాలు కూడా అందిస్తూ క‌ష్ట కాలంలో తామంతా అండ‌గానే ఉంటామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.విపత్క‌ర స‌మ‌యంలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల వాయిదాను జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే పండ‌గకు త‌మ సినిమా లేక‌పోయినా వ‌చ్చేసినిమాలు బాగా ఆడాల‌ని మ‌నఃస్ఫూర్తిగా వీరంతా ఆశిస్తున్నారు.

దేశం గ‌ర్వించ‌ద‌గ్గ సినిమా ఆర్ఆర్ఆర్ అని మొద‌ట్నంచి చెబుతూ వ‌స్తున్నారు.ఆ స్థాయిలో తెలుగు ప్రాంతాల‌కు చెందిన వీరుల క‌థ‌కు ఓ ఫిక్షన్ పాయింట్ జోడించి ఈ పిరియాడిక‌ల్ డ్రామాను న‌డిపాన‌ని మొద‌ట నుంచి రాజ‌మౌళి చెబుతూనే ఉన్నారు.ఈ నేప‌థ్యంలో సినిమాపై అంచనాలు పెంచేందుకు సంబంధిత బృందం చేసిన కృషి ఎంతో మంచి ఫ‌లితాల‌నే ఇచ్చింది.ప్రాంతాల‌కు అతీతంగా,భాష‌ల‌కు అతీతంగా ఈ సినిమాను సొంతం చేసుకున్నారు.దీంతో ఆర్ఆర్ఆర్ బృందం ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.ఇలాంటి సంద‌ర్భంలో క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా నెల‌కొన్న అసాధార‌ణ, అన‌నుకూల ప‌రిణామాల నేప‌థ్యం సినిమా విడుద‌ల తేదీ మార్పు అయింది.

 

ఆర్ఆర్ఆర్ సినిమా ఇవాళ విడుద‌ల కావాల్సి ఉంది..కానీ విడుద‌ల కాలేదు.కోవిడ్ కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల‌ను మార్చికి వాయిదా వేశారు.అది కూడా క‌న్ఫం కాద‌నే తెలుస్తోంది.మ‌ళ్లీ డేట్ మారితే మార‌వ‌చ్చు.రామ‌య్య కోసం అంతా ఎదురు చూశారు.. రామ‌య్య రాక ఎంతో ఉన్న‌తంగా ఉంటుంద‌ని చాలా మంది భావించారు.రామ‌య్య అంటే నంద‌మూరి రాముడు అని, రామ‌య్య అంటే కొణెద‌ల రాముడు అని..ఇద్ద‌రి రాక కోసం వేచి వేచి చూసింది ఆంధ్రా లోగిలి..కానీ సినిమా వాయిదా ప‌డ‌డంతో అంతా నిరా శ‌లో ఉండిపోయారు.సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లు కూడా చాలా చోట్ల జ‌రిగాయి.యాభై కోట్లు వీటికే వెచ్చించారు.త‌మిళ తీరాన మ‌న హీరోల‌కు అపూర్వ ఆద‌ర‌ణ ల‌భించింది.ముంబ‌యి,కేర‌ళ తీరాల్లో మ‌న తెలుగు హీరోల‌కు,ద‌ర్శ‌కులు రాజ‌మౌళికి హార‌తులు ప‌ట్టా రు.సినిమా ప్ర‌మోష‌న్ కు సల్మాన్ లాంటి వారు ఎంత‌గానో స‌హ‌క‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: