టాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోలు ఈయన నటన చూస్తూ పెరిగారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలో ముందుకు అడుగులు వేశారు. తెలుగు సినీ పరిశ్రమను పాలిస్తున్న రారాజు ఆయనే మెగాస్టార్ చిరంజీవి. అలనాటి ఆణిముత్యం అన్న తారక రామారావు తర్వాత దిగువ స్థాయి నుంచి వచ్చి తన కృషితో ఫలితాన్ని అందుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రపథానికి ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సౌత్ నుండి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న ఘనత ఒక్క మెగాస్టార్ చిరంజీవికే దక్కింది. పవర్ఫుల్ యాక్షన్ అయినా, కామెడీ అయినా, ఎమోషన్స్, ఇలా ఏదైనా సరే 100% ఇచ్చేయడం చిరుకి సొంతమైన నైపుణ్యం.

ఇక మెగాస్టార్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోట్లాది మంది ప్రేక్షకులను తన అభిమానులుగా చేసుకున్న ఘనుడు ఈ గ్యాంగ్ లీడర్. చిరు కనిపిస్తే మెగా ఫ్యాన్స్ లో పట్టలేని సంతోషం పరుగులు తీస్తుంది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని, సక్సెస్ మీటింగ్స్ అని ప్రమోషన్స్ అని ఇలా తరచూ మెగాస్టార్ అభిమానులను పలకరిస్తుంటారు. అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ తో ఎలా ఉంటారు, ఎలా నడుచుకుంటారు అంటే, ప్రేక్షకులను తన సోదరులుగా భావిస్తారు చిరు. పేద, ధనిక తేడాలను ఎన్నడూ ఆయన కనబరిచినట్లు చూసింది లేదు విన్నది లేదు. అంతగా ఆయన అందరికీ గౌరవం ఇస్తారు.

మెగాస్టార్ చిరంజీవి చాలా మృదు స్వభావి, ఎలాంటి సందర్భంలో అయినా  ఎదుటి వారి హృదయాలను గాయపరచే మాటలను అస్సలు అనరు. ఫ్యాన్స్ ఆనందం రెట్టింపు అయ్యేలా ఆయన మాటలు ఉంటాయి. అభిమానులను చూడగానే చిరు మోములో ఒక వెలుగు, చిరునవ్వు విరభూస్తాయి. తనను ఇంత వాడిని చేసిన అభిమానులంటే ఆయనకు విపరీతమైన గౌరవం. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ అభిమానులు స్టెప్ వేయమని అడిగితే చిరునవ్వు నవ్వి వారికోసం కాలు కదుపుతారు చిరు. ఏమాత్రం గర్వం చూపించరు స్టేజ్ పై కూడా తన మాటల బాణీతో అభిమానులను నవ్వించడానికి, ఖుషీ చేయడానికి ప్రయత్నిస్తారు. తనను నేడు ఈ స్థాయికి తీసుకొచ్చిన ఫ్యాన్స్ అంటే ఆయనకు అంత ప్రేమ.

మరింత సమాచారం తెలుసుకోండి: