రాజమౌళితో సినిమా చేయాలి అని అంటే  ఏళ్ల తరబడి కాల్షీట్స్ ఇవ్వాల్సిందే. అయితే బాహుబలి సినిమా కోసం ప్రభాస్ ఐదేళ్లు కేటాయించడం జరిగింది. ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ అయితే ఏకంగా మూడేళ్ల సమయం వెచ్చించారు. అయితే ఎన్టీఆర్ ప్రతి సంవత్సరం ఒక సినిమాతో ఆయన తన అభిమానులను పలకరించే వెళ్తాడు కానీ ఈసారి మాత్రం గత మూడేళ్ళుగా తను ఇలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో ఎంతో నిరాశ వ్యక్తపరుస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక 2018లో అరవింద సమేత సినిమాతో ఆఖరిగా  థియేటర్లలో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పటివరకు మళ్లీ కనిపించలేదు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్లో 2019, 2020, 2021 సంవత్సరాలు ఖాళీగా గడిచిపోయాయి. 

ఇకపోతే ఒకప్పుడు ఒక సినిమాకి 30 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే వాడు కానీ ఇప్పుడు దాదాపు 50 కోట్ల పారితోషికం ఎన్టీఆర్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ లెక్కన చూసుకుంటే ఈ మూడు సంవత్సరాలు ఎనక సినిమా చేసి ఉంటే 150 కోట్ల పారితోషికం జూనియర్ ఎన్టీఆర్ అందుకునే వాడు. ఇక ఈ మూడేళ్లలో ఏ సినిమా చేయకుండా జూనియర్ ఎన్టీఆర్ ఉండడంతో తన భార్య అలసిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక జూనియర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కూడా వాయిదా పడడంతో చాలా డి ప్రెస్ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ నెక్ట్స్ లైన్ లో ఉన్న తన సినిమాలు కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు, కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమాలు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా ఈ సినిమాలను స్టార్ట్ చేయాలని పోపులో ఉన్నాడు ఎన్టీఆర్.మార్చ్ ఫస్ట్ వీక్ లోగా  కొరటాల శివ సినిమా స్టార్ట్ చేయాలి అనకున్నాడు ఎన్టీఆర్. కాని తను అనుకున్న ప్లాన్ లు అన్నీ కూడా ఫ్లాప్ అవడంతో సినిమా త్వరగా ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాడు. అంతే కొరటాల శివ ఈ విషయంలో బాగా  ప్రెజర్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల తారక్ కొరటాల శివ సినిమా ను ప్రారంభించి రెండు మూడు నెలలకు బుచ్చిబాబు సినిమాను కూడా ఓపెనింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇక తారక్ నటించబోయే ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ ఎక్కించాలి అనుకుంటున్నాడు.  లేకపోతే తారక అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందో లేకపోతే ఈ మహమ్మారి కారణంగా తన ప్లాంన్స్ అలాగే మిగిలి పోతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: