టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోగా రాణిస్తూ వరుస చిత్రాలు చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
అల్లు వారి ఫ్యామిలీ తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ బాగా దగ్గరగా ఉంటారు. ముఖ్యంగా బన్నీ సతీమణి స్నేహ రెడ్డి భర్త అల్లు అర్జున్ మూవీ అప్డేట్స్ మరియు తన పిల్లల గురించిన విశేషాలు  ఫ్యాన్స్ కి  ఎప్పటికప్పుడు తెలియచేస్తూ సందడి చేస్తుంటారు.  బన్నీ ఖాళీ సమయం దొరికితే చాలు తన సమయాన్ని మొత్తం పిల్లలతో గడపడానికే ఇష్టపడతారు. పిల్లలంటే తనకు పంచ ప్రాణాలు. ముఖ్యంగా కూతురు అర్హ అంటే బన్నీకి చాలా చాలా స్పెషల్ అట. ఎపుడు ఎంతో బిజీగా ఉండే స్టార్ హీరో అల్లు అర్జున్ ఏమాత్రం ఫ్రీ టైం దొరికినా అది ఫ్యామిలీ కోసం స్పెండ్ చేస్తారు.

తన పిల్లలు అయాన్, అర్హ లను తీసుకుని అలా లాంగ్ డ్రైవ్ కు వెళుతుంటారట. కొన్ని సార్లు భార్య స్నేహను  తీసుకోకుండానే పిల్లలతో అలా కార్ లో షికార్ చేయడానికి వెళ్లిపోతుంటారట బన్నీ. అంతేకాదు వారితో కలసి డ్యాన్స్ చేయడం, పెయింటింగ్ ఇలా వారితో ఉంటే చిన్నపిల్లాడిలా మారిపోయి తన పిల్లల సంతోషాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు బన్నీ. సాధారణంగా ఏ తండ్రి అయినా పిల్లలను ప్రాణంగా ప్రేమిస్తారు...అయితే అల్లు అర్జున్ ని చూస్తే అంతకంటే ఎక్కువ గానే తన పిల్లలను ప్రేమిస్తారు అని అనిపిస్తుంది.

అంతలా తన ఫ్యామిలీ కు ఇంపార్టెన్స్ ఇస్తారు బన్నీ. స్నేహ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు వీళ్లకు సంబంధించిన ఫోటోలను,వీడియోలను  సోషల్ మీడియా వేదిక పై షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంటారు. ఈమెకు సోషల్ మీడియా వేదికలో చాలా క్రేజ్ ఉంది. ఇటీవలే అత్యధిక ఫాలోవర్స్ ని సంపాదించుకొని ప్రధమ స్థానంలో ఉన్న విషయం అందరికి తెలిసే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: