ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వైవాహిక బంధంలో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కొనసాగించి..ఆ తర్వాత విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే.. ఇక అమీర్ ఖాన్ - కిరణ్ రాజు, సమంత - నాగచైతన్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్టార్ సెలబ్రిటీలు వారి వివాహ బంధాలను తెగతెంపులు చేసుకున్నారు. ఇక సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా విడాకుల పేరుతో తమ భాగస్వామి తో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో జంట టెలివిజన్ రంగంలో బ్యూటిఫుల్ కపుల్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమీర్ అలీ - సంజీదా షేక్ కూడా విడాకులు తీసుకున్నట్లు తాజాగా ప్రకటించారుఇకపోతే కొన్ని సీరియల్స్ తోపాటు రియాలిటీ షోలతో ఎక్కువగా కనిపించిన ఈ జంట ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది.. అయితే హఠాత్తుగా విడిపోతున్నట్లు చెప్పడంతో అటు అభిమానులు, ఇటు బుల్లితెర ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.. గత రెండు సంవత్సరాల క్రితమే వీరిద్దరూ విడిపోతున్నారు అన్నట్టుగా వార్తలు వచ్చినా.. వీటిపై ఈ బ్యూటిఫుల్ జంట ఏమాత్రం స్పందించలేదు..కానీ తాజాగా వీరిద్దరూ అధికారికంగా ప్రకటించడంతో  ఇండస్ట్రీ మొత్తం షాక్ లోనే ఉండిపోయింది.అయితే వీరు ఎందుకు విడిపోతున్నారు అనే వివరాలు మాత్రం బయటకి వెల్లడించడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు అన్నట్లుగా తెలుస్తోంది. 2012లో ప్రేమించి వివాహం చేసుకున్న వీరిద్దరూ దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా తమ వైవాహిక బంధాన్ని గడిపారు. ఇకపోతే వీరిద్దరూ కలిసి జంటగా నటించిన రియాల్టీ షో నచ్ బలియే -3 లో మంచి సక్సెస్ పొందిన విషయం తెలిసిందే.. ఇద్దరూ బయట ఎన్నిసార్లు కనిపించినప్పటికీ దాంపత్య జీవితంలో చాలా సంతోషంగా కొనసాగిస్తునట్లుగా కనిపించేవారు. అంతేకాదు గత 2020 సంవత్సరం లో సరోగసీ ద్వారా బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆ బిడ్డ బాధ్యత సంజీదా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె మరోపక్క కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: