షణ్ముఖ్, దీప్తి సునైనాల గురించి సోషల్ మీడియా టచ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. సూపర్ జోడీగా అలరించే వీళ్లిద్దరు తమ ప్రేమ గురించి చాలా సార్లు ఓపెన్ అయ్యారు. షణ్ముఖ్ తోనే దీప్తి.. దీప్తి వెంటే షణ్ముఖ్ అనేలా చాలాసార్లు ప్రూవ్ చేశారు. ఇదిలాఉంటే బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక షణ్ముఖ్ తో బ్రేకప్ చెప్పేసింది దీప్తి సునైనా. షణ్ముఖ్, సిరిల వ్యవహారం తనని బాగా హర్ట్ చేసినట్టుంది అందుకే ఐదేళ్ల వారి రిలేషన్ ని కాదనుకుంది.

షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇష్టం లేకపోయినా సరే దీప్తి నుండి దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం షణ్ముఖ్ ని దూరం చేసుకున్న బాధలో ఉన్న దీప్తి సునైనా తాను ఒంటరిని కాదని తన వెనక ఓ శక్తివంతమైన శక్తి ఉందని అది తన నాన్న అని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. తన తండ్రి దగ్గర చిన్నపిల్లలా మారి అల్లరి చేస్తుంది దీప్తి సునైనా.

షణ్ముఖ్, దీప్తి సునైనాల విషయంలో పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినా సరే వీళ్లిద్దరి మధ్య గొడవల వల్ల విడిపోదామని అనుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ సిరితో ఎమోషనల్ గా కనెక్ట్ అవడం గురించి దీప్తి సునైనా చాలా హర్ట్ అయ్యింది. అందుకే ఇష్టం లేకపోయినా సరే షణ్ముఖ్ ని దూరం పెడుతూ వస్తుంది. అయితే వీళ్ల గొడవ కొన్నాళ్ల వరకే అని.. తప్పకుండా వెళ్లిద్దరు మళ్లీ కలుస్తారని వాళ్ల ఫ్రెండ్స్ చెప్పుకుంటున్నారు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి. అయితే షణ్ముఖ్ ఈ విషయాలన్ని పక్కన పెట్టి తన కెరియర్ మీద ఫోకస్ చేయాలని చూస్తున్నాడు. దీప్తి సునైనా కూడా సినిమాల్లో లీడ్ యాక్ట్రెస్ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ముందు కెరియర్ లో ముందుకు వెళ్తుంటే.. ఆ తర్వాత వారి గమ్యం ఏంటన్నది తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: