తన ఒక్క సినిమాతో తన కెరీర్ని మార్చుకుంది ఈ బ్యూటీ. ఉప్పెన సినిమాతో పరిచయం అయిన ఈ బ్యూటీ ఉప్పెనలా అవకాశాలతో ముంచెత్తుతోంది.  ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన కన్నడ హీరోయిన్ కృతి శెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. అంతేకాకుండా 6 నెలల్లో 5 సినిమాల రిలీజ్ లతో.. ఫాన్స్ కి బ్యాక్ టూ బ్యాక్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్లాన్ చేసింది  కృతి శెట్టి. తను నటించిన ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది ఈ భామ. ప్రస్తుతం అవకాశాల కోసం ఎంతో ఎదురు చూస్తున్నా కొంతమంది హీరోయిన్లు ఉన్న ఈ టైమ్ లో అభినయంతో అందరినీ ఎట్రాక్ట్ చేసి ఉప్పెన లాంటి అవకాశాలతో వరుసగా 5 సినిమాల్లో ఆఫర్లు కొట్టేసింది ఈమె.

అంతేకాకుండా ఇప్పుడు ఉన్న సీజన్లో ఎవరికీ లేనని ఎక్కువ రిలీజ్ లో ఉన్నాయి కృతి శెట్టి కి. ఇక మొన్నటి క్రిస్మస్ కానుకగా కృతి శెట్టి మరియు నాని జతగా ఫ్యాన్ సింగర్ రాయ్ సినిమాతో అందరినీ ఆకట్టుకుంది ఈ భామ.శ్యామ్ సింగరాయ్ సినిమాలో కాస్త గ్లామరస్ గానే కనిపించి నేను ట్రెండ్ ని ఫాలో అవుతాను అంటూ హింట్ ఇచ్చింది కృతి.  ఇకపోతే ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్ లో మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయి కొద్ది కాలమే అయినా గ్యాప్ కూడా లేకుండానే బంగార్రాజుతో కలిసి సంక్రాంతికి వస్తోంది బేబమ్మ.  ఇక బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి ఊరి ప్రెసిడెంట్ గా క్యూట్ రోల్ ప్లే చేస్తోంది.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య మరియు కృతి శెట్టి జంటగా కనిపించనున్నారు. ఇక కృతి శెట్టి ఈ సినిమాల తర్వాత  సుధీర్ బాబుతో నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రిలీజ్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో రానుంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరిలో గానీ, మార్చిలో కానీ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఇక ఇప్పటికే ఏప్రిల్ కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది నితిన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా. ఇలా కృతి శెట్టి 6 నెలల్లో 5 సినిమాలతో ఆడియన్స్ కి బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్ ప్లాన్ చేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: