ప్రతి శుక్రవారం తెలుగు వారికి కొత్త అలవాటు అంటూ ఓ కొత్త సినిమాతో వస్తున్నారు ఆహా టీం. తెలుగు ఓటీటీగా అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ కు ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తుంది ఆహా. సినీ ప్రియులైన తెలుగు ప్రేక్షకులకు ఆహా ఒరిజినల్ మూవీస్ తో అలరిస్తుంది. రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ తో సేనాపతి మూవీ తీసి సక్సెస్ అయిన ఆహా ఇప్పుడు ది అమెరికన్ డ్రీమ్ సినిమాతో వస్తుంది. బ్రతకడానికి అమెరికా వస్తే.. ఇక్కడ అమెరికా అసలు రంగేంటో అర్ధమైంది అని ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ తో ట్రైలర్ కట్ చేశారు.

ది అమెరికన్ డ్రీమ్ ట్రైలర్ ఇంప్రెసివ్ గా అనిపించింది. ప్రిన్స్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను విఘ్నేష్ కౌశిక్ డైరెక్ట్ చేశారు. ఈ ఆహా ఇండిపెండెంట్ మూవీని ప్రదీప్ రెడ్డి నిర్మించారు. ప్రిన్స్ కు జోడీగా నేహా కృష్ణ నటించారు. సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. అమెరికా లో బ్రతకాలన్న డ్రీమ్ తో అక్కడకు వెళ్లిన వ్యక్తి ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు అన్న కథతో ఈ మూవీ వస్తుంది.

ట్రైలర్ మాత్రం చాలా బ్రిలియంట్ గా కట్ చేశారు. హీరోగా కొన్ని ప్రయత్నాలు చేసి ఈమధ్య అసలు కనిపించకుండా పోయిన ప్రిన్స్ ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. ఆహాలో రిలీజ్ కాబట్టి ప్రమోషన్స్ థియేట్రికల్ రిలీజ్ రేంజ్ లోనే ఉంటాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఆహాలో ది అమెరికన్ డ్రీమ్ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు సినీ ప్రియులను అలరించేందుకు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో ఆహా ఒరిజినల్ మూవీస్ వస్తున్నాయి. ది అమెరికన్ డ్రీం కూడా వాటిలో భాగంగా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ట్రైలర్ చూసిన ఆడియెన్స్ సినిమా చూసేందుకు ఎక్సయిటింగ్ గా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ది అమెరికన్ డ్రీమ్ ట్రైలర్ మీద ఓ లుక్కేయండి.





మరింత సమాచారం తెలుసుకోండి: