సంక్రాంతికి రెండు భారీ సినిమాలు వాయిదా పడటం వల్ల అంతా చప్పగా ఉంది. ఓ పక్క కొవిడ్ తీవ్రత పెరుగుతున్న కారణంగా ఇతర రాష్ట్రాల్లో థియేటర్లు మూసి వేయడం.. సగం సీట్లు ఫిల్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. అయితే ఏపీ, తెలంగాణాలో మాత్రం అలాంటిది ఏమి కనిపించడం లేదు. కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫిక్స్ అయినట్టు ఉన్నారు. అందుకే ఇతర రాష్ట్రాలు ప్రస్తుతం వచ్చిన థర్డ్ వేవ్ తో కంగారు పడుతుంటే మన రాష్ట్రాల్లో ఏమాత్రం చలనం లేకుండాపోతుంది.

ఈ క్రమంలో సంక్రాంతి సినిమాలు సందడి చేయనున్నాయి. తెలుగు పరిశ్రమకు సంక్రాంతి పండుగ చాలా పెద్దది. ఆ టైం లో బాక్సాఫీస్ కళకళలాడుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందో లేదో తెలియదు ఇదిలాఉంటే ఈ పొంగల్ రేసులో కేవలం మూడంటే మూడు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయనున్నాయి. అందులో ఒకటి కింగ్ నాగార్జున బంగార్రాజు కాగా.. మరో రెండు కొత్త కుర్రాళ్ల సినిమాలు.

దిల్ రాజు ఇంటి వారసుడు ఆశిష్ హీరోగా వస్తున్న రౌడీ బోయ్స్, సూపర్ స్టార్ కృష్ణ మనవడు గల్లా అశోక్ హీరో సినిమా రెండు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. హీరో పక్కా కమర్షియల్ ఫార్మెట్ సినిమాగా వస్తుంది. ఆ సినిమాలో నిధి అగర్వాల్ గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఇక రౌడీ బోయ్స్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రానుంది. వీరి మధ్యలో బంగార్రాజు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుంది. మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ చేస్తూ బాక్సాఫీస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు కింగ్ నాగార్జున. యువ హీరోలు అందులో కొత్త కుర్రాళ్లు నాగ్ తో పోటీ పడి ఏమేరకు మెప్పిస్తారో చూడాలి. ఈ మూడు సినిమాల్లో ఆడియెన్స్ అందరు బంగార్రాజుకే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: