మెగా బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ లో ఇప్పటివరకు కేవలం మెగాస్టార్ సినిమాలనే నిర్మిస్తూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు మాత్రమే ఈ ప్రొడక్షన్ హౌజ్ అని అనుకున్నారు. మొన్నామధ్య కొణిదెల బ్యానర్ లో కూడా ఇతర స్టార్ హీరోల సినిమాలు వస్తాయని చెప్పినా సరే ఇంకా అది వర్క్ అవుట్ కాలేదు. అయితే లేటెస్ట్ గా కొణిదెల ప్రొడక్షన్స్ నయా ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో పాటుగా కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట.

కంటెంట్ ఉండి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా వచ్చే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ క్రమంలో కొణిదెల ప్రొడక్ష బ్యానర్ లో కూడా పెద్ద సినిమాలతో పాటుగా చిన్న సినిమాలను కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ విషయాలను మెగా పవర్ స్టార్ రాం చరణ్ చూస్తున్నారు. ఇప్పుడు స్మాల్ బడ్జెట్ సినిమాల బాధ్యత కూడా తన మీద వేసుకుంటున్నాడట.

తన సినిమా కథలతో పాటుగా కాన్సెప్ట్ బాగున్న చిన్న సినిమా కథలు కూడా వింటున్నాడట చరణ్. మెగా బ్యానర్ కాబట్టి ఆర్టిస్టులకు కూడా మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఖైది నెంబర్ 150తో మొదలైన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు మెగా మల్టీస్టారర్ సినిమా కూడా ఈ బ్యానర్ లోనే రాబోతుందని టాక్. చిరు, పవన్ మల్టీస్టారర్ సినిమాకు ఎప్పటినుండో ప్లాన్ జరుగుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇప్పటికే చరణ్, చిరు కలిసి ఆచార్య సినిమాలో నటించారు. ఇక రావాల్సింది చిరు, పవన్ సినిమానే.. మెగా మల్టీస్టారర్ కు త్రివిక్రం డైరక్షన్ చేస్తాడని గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాటే. కానీ ఈ ప్రాజెక్ట్ ముహుర్తం మాతం బయటపడట్లేదు.




మరింత సమాచారం తెలుసుకోండి: