తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ టాప్ హీరోలు చాలామంది తమ సినిమాలను విడుదల చేసేవారు, అలా సంక్రాంతి కి తమ సినిమాలను విడుదల చేసేందుకు తన సినిమా షూటింగ్ లను కూడా అందుకు తగినట్టుగా ప్లాన్ చేసుకునేవారు. ఇలా ప్రతి సారి కూడా దాదాపుగా సంక్రాంతి బరి లో టాప్ హీరోల సినిమాలు నిలుస్తూ ఉండేవి. కానీ ప్రస్తుత సంవత్సరం మాత్రం అలాంటి పరిస్థితి కనబడడం లేదు. కొన్ని రోజుల క్రితం వరకు సంక్రాంతి బరిలో పాన్ ఇండియా సినిమాలు అయినా ఆర్ఆర్ఆర్, రాదే శ్యామ్ నిలుస్తాయని చాలామంది అనుకున్నారు.  కాకపోతే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు విరివిగా విరివిగా పెరుగుతూ పోవడంతో ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరి నుండి  తప్పుకున్నాయి. ఒక బంగార్రాజు సినిమా మినహాయిస్తే ఈసారి సంక్రాంతి బరిలో ఏవీ పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమాలు లేవు. చాలా వరకు చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడుతున్నాయి. ఈసారి బాక్సాఫీస్ దగ్గర తలపడటానికి సిద్ధంగా ఉన్న చిన్న హీరోల సినిమాల గురించి తెలుసుకుందాం.

హీరో : అశోక్ గల్లా హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో అశోక్ గల్లా బాక్సాఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీన విడుదల కాబోతుంది.

సూపర్ మచ్చి : కళ్యాణ్  దేవ్ హీరోగా రుచిత రామ్ హీరోయిన్ గా తెరకెక్కిన సూపర్ మచ్చి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ సంక్రాంతి బరిలో నిలబడబోతున్నాడు.

రౌడీ బాయ్స్ : ఆశిష్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సినిమాతో ఆశిష్ సంక్రాంతి బరిలో  నిలబడబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: