నిధి అగర్వాల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సవ్యసాచి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నిధి అగర్వాల్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయినా నిధికి మాత్రం అవకాశాల ను బాగానే తెచ్చిపెట్టింది. అందాల నిధిని ఆరబొస్తున్న ఈ అమ్మడు అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.. అందుకే యూత్ ఫ్యాన్ ఫాలొయింగ్ అమ్మడు ఎక్కువే.. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న హాట్ బ్యూటీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది.


ఒక పక్క టాలీవుడ్ లో చేస్తూనే కోలీవుడ్ లోను స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడిందంటూ కోలివుడ్ లో వార్తలు గుప్పు మంటున్నాయి. కోలీవుడ్ మన్మధుడు శింబు, నిధి అగర్వాల్ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.శింబు లవ్ స్టోరీస్, బ్రేకప్ ల గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. నయనతార, త్రిష, హన్సిక లాంటి హీరోయిన్ల తో శింబు రిలేషన్ లో ఉండడం తరువాత విడిపోవడం ఆయనకు కొత్త కాదు.. సినిమా ఇండస్ట్రీ వాళ్ల తోనే కాకుండా బయట వాళ్ళతో కూడా అతని ప్రేమాయణం వుంది.


తాజాగా నిధి తో శింబు రిలేషన్ కొనసాగిస్తున్నాడంట. వీరిద్దరూ కలిసి ఈశ్వరన్ సినిమా లో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందంట. గత రెండేళ్ల నుంచి వీరిద్దరూ చెన్నై లోని ఒక ఇంట్లో కలిసే ఉంటున్నారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోనున్నదట. ప్రస్తుతం వీరిద్దరూ కెరీర్ పై ఫోకస్ పెట్టారని, త్వరలోనే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. ఈ వార్త ల్లో నిజం ఎంత వుందో తెలియాలం టే కొద్ది రోజులు ఆగాల్సిందే..ఈ పుకారు పై వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: