అత్యధికంగా భారీ బడ్జెట్ తో రూపొందించిన ఒక సినిమా విడుదల తేది వాయిదా పడిందంటే.. ఆ ప్రభావం కేవలం ఒక ప్రొడ్యూసర్ పై మాత్రమే కాకుండా దాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ పై , అందులోనూ యాక్టింగ్ చేసిన నటీనటుల పైన , ఆ సినిమా కొన్న బయ్యర్ల పైన కూడా దీని ప్రభావం చాలానే ఉంటుంది. ఇక అంతే కాకుండా ఇతర సినిమాలపై కూడా దీని ప్రభావం గట్టిగానే ఉంటుందని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలో ఒక బడా మూవీ ఆగిపోవడంతో ఈ విషయం బాగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఈ సినిమాకి డైరెక్టరే ఫైనాన్స్ బాధ్యత అంటూ షూరిటీ కూడా ఇవ్వడంతో పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది.


తను తీసిన సినిమాలలో ఇప్పటివరకు విజయాన్ని చూశాడు ఆ డైరెక్టర్. కొన్ని వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించి దేశవ్యాప్తంగా తనకున్న క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఇక డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా విడుదల కాబోతోంది అంటే ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసేవారు. కానీ పరిస్థితుల రీత్యా కొన్ని కారణాలవల్ల ఈ సినిమాని చివరి నిమిషంలో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు మరొక సమస్య ఎదురైంది. ఈ సినిమా కొన్న బయ్యర్లు కొన్ని సంవత్సరాల కిందటే అడ్వాన్సు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ప్రతిసారీ సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఉండడంతో వారికి వడ్డీలు చాలా పెరిగిపోతున్నాయని.. ఈ వడ్డీల భారం ని మోయలేని పరిస్థితి లో ఉన్నామని తెలియజేశారట.. కేవలం ఇదంతా డిస్ట్రిబ్యూటర్లకు పరిస్థితి.


అయితే ఇక ఈ సినిమాని నిర్మించడానికి ప్రొడ్యూసర్లు ఫైనాన్స్ లో మనీ ని తీసుకు వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉందో ఇక మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా నిర్మాతలు కూడా ఈ భారాన్ని మోయలేక చాలా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఫైనాన్స్ కింద ఇచ్చిన అమౌంట్ 180 కోట్లు.. ఈ మొత్తానికి ఈ డైరెక్టరే షూరిటి ఉంటానునడంతో  కాస్త నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నాడు. దీంతో ఆ డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరొక కొత్తదనానికి శ్రీకారం చుట్టాడు ఆ స్టార్ డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: