యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎన్.టి.ఆర్ 30వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్లో ఆరెడీ జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. అయితే ఎన్.టి.ఆర్ 30వ సినిమాగా కొరటాల శివ ముందు ఓ కథని అనుకున్నారట. కానీ ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా చూడమని చెప్పాడట.

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో కెరియర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు తారక్. ఎలాగు రాజమౌళి సినిమా కాబట్టి ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ 30వ సినిమాని కూడా ఆ రేంజ్ కి తగినట్టుగా ప్లాన్ చేస్తున్నారట. ఎన్.టి.ఆర్ 30వ సినిమా కథ అదిరిపోతుందని అంటున్నారు.

తన సినిమాలు కమర్షియల్ గా ఉంటూనే ఏదో ఒక సామాజిక అంశాన్ని లేవనెత్తే కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ సినిమా రాగానే తారక్ తో సినిమా షురూ చేస్తాడట. ఈలోగా కథని కూడా ఫైనల్ చేస్తాడని టాక్. కొరటాల శివ మీద ఎంత నమ్మకం ఉంటేనో పూర్తి కథ వినకుండా ఎన్.టి.ఆర్ సినిమా ఓకే చేశాడు. మరి జనతా కాంబో ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారు.. ఎలాంటి హంగామా సృష్టిస్తారో చూడాలి. ఈ సినిమాతో పాటుగా ఉప్పెన సినిమాతో సంచలన విజయం అందుకున్న బుచ్చి బాబుతో కూడా ఎన్.టి.ఆర్ సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా డిఫరెంట్ అటెంప్ట్ అని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అని ఫిక్స్ అవ్వొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: