1990 దశకంలో కోలీవుడ్, టాలీవుడ్ లలో అత్యంత ప్రజాదరణ కలిగిన హీరోయిన్  రాజగోపాల్. అందం , అభినయంతో పాటుగా స్టయిలిష్ లుక్స్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోనే పాత్రలు పోషించారు. 

తమిళనాడు కు చెందిన ఆర్మీ కుటుంబంలో జన్మించిన హీరా. తండ్రి రాజగోపాల్ తరుచుగా బదిలీలు కావడంతో తన విద్యాభ్యాసం మొత్తం పలు రాష్ట్రాల్లో సాగింది. వివిధ రాష్ట్రాల్లో ఉండటంతో పలు భాషలు అవలీలగా మాట్లాడగలిగేది.చెన్నై లోని ప్రముఖ విమెన్స్ క్రిస్టియన్ కళాశాలలో సైకాలజీ లో డిగ్రీ పూర్తి చేసిన చదువుకునే రోజుల్లో నే మోడలింగ్ లో రాణించారు. 

 మోడలింగ్ చేస్తున్న సమయంలోనే సినిమా ఆఫర్లు రావడంతో హీరోయిన్ గా మారిన హీరా తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ హీరో మురళి సరసన ఇధయం చిత్రంలో నటించారు. కథిర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తర్వాత తెలుగు లో హృదయం పేరుతో అనువాదమై ఇక్కడ ఘనవిజయం సాధించింది. 

మొదటి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న హీరా , మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తిరుడా తిరుడా చిత్రం జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడమే కాకుండా హీరా నటనకి సైతం మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుసగా ఆమె నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయాలను అందుకోవడంతో కోలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ అయ్యింది. కమల్ హాసన్, అజిత్, శరత్ కుమార్, మోహన్ లాల్ , బాలకృష్ణ, నాగార్జున వంటి పలువురు అగ్ర కథా నాయకులతో నటించిన హీరా 1999లో సినిమాలకు దూరం అయ్యింది. 

హీరా , సినిమాలకు దూరం కావడానికి ముందు  నటుడు అజిత్ తో ప్రేమలో ఉన్నారు.కథాల్ కొట్టాయ్ (తెలుగు లో ప్రేమ లేఖ) చిత్ర షూటింగ్ లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమ ఎంత వరకు వెళ్ళింది అంటే ఆరోజుల్లోనే వారిద్దరూ కలిసి ఒకే ఇంట్లో కలిసి ఉంటూ సహజీవనం చేసేదాక. ఈ సమయంలోనే అజిత్ బైక్ ప్రమాదంలో గాయపడితే దగ్గరుండి అన్ని తానే చూసుకుంది. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని కోలీవుడ్ మీడియా కోడై కూస్తున్న సమయంలో అనూహ్యంగా తామిద్దరం విడిపోయాం అని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. 

అజిత్ తో విడిపోయిన తర్వాత మానసికంగా కుంగిపోయి సినిమాల మీద దృష్టి సారించలేక సినిమాలకు దూరం అయిన హీరా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ను వివాహం చేసుకొంది కానీ అతను అతి కొద్ది కాలానికే విడిపోయారు . దాంతో మరింత కుంగిపోయి ఇండియా వదిలి విదేశాలకు వెళ్లి  వ్యాపారాలను నిర్వహిస్తూ వ్యాపారవేత్త గా స్థిరపడింది.  అప్పుడప్పుడు ఇండియా వస్తూ మీడియా కంట పడకుండా తన వ్యాపారాలు చూసుకొని వెళ్లిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: