‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల మళ్ళీ వాయిదా పడటంతో చరణ్ జూనియర్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సాధారణ ప్రేక్షకులు కూడ ఈ మూవీ వాయిదా పడటంతో కొంతవరకు నిర్లిప్తతో ఉన్నారు. తిరిగి దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత మాత్రమే ఈ మూవీ విడుదల అవుతుంది. అది ఎప్పుడు అన్నవిషయం రాజమౌళికి కూడ తెలియని ప్రశ్న.


ఈ మూవీకి దేశవ్యాప్తంగా 500 కోట్లకు పైగా ప్రీ బిజినెస్ జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ బయ్యర్లకు కూడ నిరుత్సాహం రాకుండా చూసుకోవలసిన బాధ్యత రాజమౌళి పై పడింది. దీనితో ఈ మూవీ మ్యానియాను మరికొన్ని నెలలు కొనసాగించడానికి జక్కన్న ఎలాంటి వ్యూహాలు రచిస్తాడు అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది.



తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉందట. మొదట్లో ఈ ఐటమ్ సాంగ్ ఆలోచన రాజమౌళికి లేనప్పటికీ మూవీ బయ్యర్లు కోరడంతో జక్కన్న చరణ్ జూనియర్ లతో పాటు ఒక బాలీవుడ్ బ్యూటీని ప్రత్యేకంగా తీసుకువచ్చి కొద్దిరోజుల క్రితం ఈ ఐటమ్ సాంగ్ ను చాల రహష్యంగా షూట్ చేసాడట. ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ ను కరోనా పరిస్థితులు చల్లబడిన తరువాత తిరిగి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పై మ్యానియా పెరగడానికి ఉపయోగపడే విధంగా ఈ ఐటమ్ సాంగ్ ను మార్చి నెలలో విడుదలచేసి అప్పుడు ఈమూవీకి సంబంధించిన సరికొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే ఆలోచనలో ఉన్నాడట.


ఇంతవరకు రాజమౌళి ఆలోచన బాగానే ఉన్నప్పటికీ స్వాతంత్ర ఉద్యమ నేపద్యంతో తీసిన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ను కలిపితే విపరీతమైన విమర్శలు వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఈమూవీ కథ పై కేసులు కూడ నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి అనాలోచిత నిర్ణయం రాజమౌళి తీసుకుని ఉండడు అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: