తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం వరకు స్టార్ హీరోలు అంతా చాలా వరకు ఒక సినిమా పూర్తి అయిన తర్వాతే మరో సినిమాను మొదలు పెట్టేవారు,  లేకపోయినట్లయితే సినిమా ఫైనల్ దశకు వచ్చిన తర్వాత ఇంకో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లేవారు.  కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు స్టార్ హీరోలు  ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, బోలా శంకర్, బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న చిరంజీవి,  వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలు నటిస్తున్నాడు. దీనితో పాటు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయిన హరిహర వీరమల్లు సినిమాను తిరిగి ప్రారంభించబోతున్నారు.

అలాగే భగవదియుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ  సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. అలాగే  ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ లిస్ట్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి రెడీ గా ఉన్న బాలకృష్ణ ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమాలో నటించబోతున్నాడు. దీనితో పాటు సంపత్ నంది దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో బాలకృష్ణ నటించబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలి బాలకృష్ణ నటించబోయే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే కనుక నిజమైతే బాలకృష్ణ వరుస సినిమాలను ఓకే చేసిన హీరోల లిస్ట్ లో చేరిపోతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: