విజయ్ దేవరకొండ రష్మికల లవ్ కెమిస్ట్రీ ‘గీతాగోవిందం’ సక్సస్ కు చాల కీలకంగా పనిచేసింది. ఆతరువాత అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ‘డియర్ కామ్రేడ్’ మూవీలో ప్రయత్నించినప్పటికీ ఆ మ్యాజిక్ మళ్ళీ వర్కౌట్ కాలేదు. వీరిద్దరి సాన్నిహిత్యం పై గతంలో అనేకసార్లు అనేక రూమర్స్ వచ్చాయి.


అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ బిజీగా ఉండటంతో వీరిద్దరి సాన్నిహిత్యం పై అప్పట్లో వచ్చిన వార్తలు ఆగిపోయాయి. ‘పుష్ప’ మూవీతో రష్మిక నేషనల్ సెలెబ్రెటీగా మారిపోతే విజయ్ దేవరకొండ తన నేషనల్ సెలెబ్రెటీ స్థాయి కోసం లేటెస్ట్ గా నటిస్తున్న ‘లైగర్’ మూవీ విడుదల కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇలా వీరిద్దరూ తమతమ కెరియర్లలో చాల బిజీగా ఉంటూనే లేటెస్ట్ గా ఈమధ్య జరిగిన ఒక న్యూయియర్ పార్టీలో కలుసుకుని ఎంజాయ్ చేసినట్లు వార్తలు రావడమే కాకుండా ఆ సందర్భానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ ఆ ఫోటోలను విపరీతంగా చూస్తూ ఒకరినొకరు షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు మళ్ళీ విజయ్ రష్మికలు ఒక భారీ పాన్ ఇండియా మూవీలో నటించాలి అంటు తమ కోరికను కూడ వ్యక్తపరుస్తున్నారు.


ప్రస్తుతం సినిమాల పరంగా చూస్తే రష్మిక వరస హిట్లతో దూసుకుపోతు ఆమె డేట్స్ టాప్ హీరోలకు కూడ దొరకడం కష్టంగా మారింది. అయితే విజయ్ దేవరకొండ మ్యానియా కొనసాగుతున్నప్పటికీ ఈమధ్య అతడికి హిట్స్ దూరం కావడంతో విజయ్ టెన్షన్ పడుతున్నాడు. దీనితో ‘లైగర్’ సక్సస్ కోసం ఎంత కష్టపడాలో అంతవరకు కష్టపడుతూనే ఉన్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈమూవీ టీజర్ లో విజయ్ లుక్ ను చూసి యూత్ ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో రష్మిక విజయ్ లు ఒక పార్టీలో కలిసారు కాబట్టి రష్మిక అదృష్టం విజయ్ కు ట్రాన్సఫర్ అవ్వాలని అభిమానుల కోరిక..




మరింత సమాచారం తెలుసుకోండి: