సినీ ఇండస్ట్రీలో కొంత మంది ముద్దుగుమ్మల అదృష్టం ఎలా ఉంటుందంటే ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ల క్రేజ్ తెచ్చుకుని టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోతారు. దానికి బెస్ట్ ఉదాహరణ కృతిశెట్టి.. ఉప్పెన సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయ్యిపోయింది. ఎంత క్రేజ్ సంపాదించుకుందంటే..అమ్మడు తో పాటు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ ని కూడా దాటేసింది. ఉప్పెన సినిమా అంటే కృతినే గుర్తుకు తెచ్చుకుంటున్నారు కానీ వైష్ణవ్ అస్సలు పట్టించుకోవడమే మానేశారు జనాలు. అంతలా తన అందంతో మాయ చేసి..క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తుంది ఈ కన్నడ బ్యూటి. దీంతో కొందరు నెటిజన్స్ మెగా హీరో అంటూ చెప్పుకునే వాళ్లకి గాలి తీసేసింది కృతి అంటున్నారు.

నిజం చెప్పాలంటే కృతి వయస్సులో చాలా తక్కువ. ఇప్పుడున్న హీరోయిన్స్ తో పోల్చుకుంటే కృతి అందరికన్నా వయసుల్లో చాలా చిన్నది. కానీ ఆమె ఆలోచించే విధానం..సినిమాలు సెలక్ట్ చేసుకునే తీరు చూస్తుంటే స్టార్ హీరోయిన్స్ కూడా ఈమె ముందు బలాదూర్ అంటున్నారు కృతిని ఇష్టపడే వాళ్ళు. కాగా..రీసెంట్ గా నాని శ్యాం సింగరాయ్ మూవీ తో కెరీర్లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్ అందిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా గా అందుతున్న సమాచారం ప్రకారం లెటెస్ట్ సెన్సేషన్ కృతి ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాకి సైన్ చేసిన్నట్లు తెలుస్తుంది. అరుంధతి సినిమా రేంజ్ లో కధ ప్లాన్ చేసిన డైరెక్టర్ కృతి కి కధ చెప్పడం..ఆమె కు నచ్చి సైన్ చేయడం చకచకా జరిగిపోయాయట. నిజం చెప్పాలంటే ఓ హీరోయిన్ కు ఇలాంటి ఆఫర్లు కనీసం 10 సినిమాలు చేస్తే కానీ రావు..అలాంటిది కెవలం రెండు సినిమాలకే  కృతి ఇలాంటి ఆఫర్ అందుకుంది అంటే డైరెక్టర్స్ ఈమెలో ఏదో తెలియని టాలెంట్ ను చూసుంటారు అంటున్నారు నెటిజన్స్. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న కృతి మరో సినిమాకి సైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏది ఏమైనా కృతి కి ఇంత  డేర్ ఉండకూడదు అంటున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: