ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీస్ అందరూ వరుసగా పెళ్లిలు చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. కొందరు వయసు ముదిరిపోయిన తరువాత పెళ్లి చేసుకుంటే కొందరు కెరీర్ లో సెటిల్ అవ్వకముందే పెళ్ళి చేసుకోడానికి రెడీ అయ్యి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో ఉన్న బడా బడా హీరోలు ఎట్టకేలకు తమ ప్రేమించిన అమ్మాయిలను పెళ్లి చేసుకుని..ఓ ఇంటివారు అయ్యారు. హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక హీరోయిన్స్ కూడా వరుసగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. కొత్త హీరోయిన్స్ రావడం వల్ల తమ అందాలు ప్రేక్షకులకు బోర్  కొట్టుంటాయి అని భావించారో లేదా పెళ్లి చేసుకోండి అని ఇంట్లోని పెద్దవారు ప్రెజర్ చేసారో తెలియదు కానీ యంగ్ హీరోయిన్లు కూడా పెళ్లి కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇస్మార్ట్‌ పోరి  నిధి అగర్వాల్‌  కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందన్న వార్త ఫిల్మీ దునియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతూ తెగ వైరల్ గా మారింది.
ఇంతకి అమ్మడు పెళ్లి చేసుకోబోతున్న ఆ లక్కి బాయ్ ఎవరో తెలుసా.. ఇప్పటికే చాలా సార్లు పలువురు హీరోయిన్లతో ప్రేమలో పడి విఫలమైన కోలీవుడ్ స్టార్ హీరో శింబును నిధి పెళ్ళాడబోతుందంటూ.. అటు కోలీవుడ్ మీడియాలోను ఇటు టాలీవుడ్ సర్కిల్స్ లోను వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత కొంత కాలంగా శింబుతో ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో వీళ్లిద్దరూ ఏడడుగులు నడిచేందుకు రెడీ అవుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీళ్లిద్దరు ఇప్పుడు ఒక్కే ఇంట్లో కలిసి ఉంటున్నారంటూ ఓ క్రేజీ గాసిప్‌ సినీప్రియులను ఆకర్షిస్తోంది. ఇక వీళ్లిద్దరు కలిసి ఈశ్వరన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలో వీళ్ల మధ్య ప్రేమ పుట్టిందని..అది పెళ్లి వరకు వెళ్లిందని అంటుంది కోలీవుడ్ మీడియా.

మరింత సమాచారం తెలుసుకోండి: