స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ కు ఎక్స్ ట్రా కిక్ ఇస్తూ పుష్ప సర్ ప్రైజ్ చేసింది. ఓ పక్క థియేటర్ లో దుమ్ముదులిపేస్తున్నా సరే శుక్రవారం నుండి అమేజాన్ ప్రైం లో పుష్ప రిలీజైంది. ఓటీటీలో సినిమా చూసిన ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకు అంటే సినిమాలో డీలీట్ చేసిన ఓ సీన్ తో పాటుగా సమంత సాంగ్ లో రెండో చరణ్ కూడా యాడ్ చేశారు. పుష్ప సినిమాలో సమంత చేసిన ఉ అంటావా సాంగ్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ థియేటర్ లో చూసిన ఆడియెన్స్ కేవలం పల్లవి, ఒక చరణ్ మాత్రమే ఉంటుంది.

ఆ కొద్దిపాటి దానికే సమంత కోసం రెండు మూడు సార్లు సినిమా చూసిన ఆడియెన్స్ ఉన్నారు. ఈ క్రమంలో అమేజాన్ ప్రైం వర్షన్ లో మాత్రం ఉ అంటావా సాంగ్ రెండో చరణం కూడా ఉంది. సమంత ఫ్యాన్స్ కు ఈ సాంగ్ మరింత కిక్ ఇస్తుంది. ఇప్పటికే గ్లోబల్ వైడ్ ట్రెండింగ్ లో ఉన్న ఉ అంటావా సాంగ్ ఇప్పుడు రెండు చరణాలతో మరింత కిక్ ఇస్తుంది. ప్రైం వీడియోలో సమంత సాంగ్ తో పాటుగా అల్లు అర్జున్ కి సంబందించిన ఓ సీన్ కూడా యాడ్ చేశారు.

పుష్ప ఓటీటీ వర్షన్ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అలా రిలీజైందో లేదో ఇలా సినిమాని థియేటర్ లో చూడని సెలబ్రిటీస్, ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు పుష్ప ని ఓటీటీలో చూసిన కొందరు సెలబ్రిటీస్ సినిమాని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో తమ కామెంట్స్ పెడుతున్నారు. పుష్ప ఓటీటీ లో కేవలం సౌత్ భాషల్లోనే  రిలీజైంది. బాలీవుడ్ లో సినిమా ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా హిందీ వర్షన్ మాత్రం అందుబాటులో లేదని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: