తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చిత్రీకరించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. అలాగే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

అయితే ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో డివివి దానయ్య నిర్మాతగా వస్తున్న 'ఆర్ఆర్ఆర్' లో నటిస్తున్న నటి ,నటీమణులు రెమ్యూనరేషన్ తెలిస్తే అందరూ షాక్ అవుతుతున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ దాదాపు 400 కోట్లు పెట్టినట్లు అంచనా. ఈ మూవీలో అల్లూరి రామరాజు క్యారక్టర్ చేస్తున్న రామ్ చరణ్ కి 25 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలాగే కొమరం భీం క్యారెక్టర్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కి 25 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో రాజమౌళి టాలీవూడ్ హీరోలతో పాటుగా బాలీవూడ్ నటులను కూడా తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో  బాలీవుడ్ హీరోయిన్ అయిన అలియా భట్ ఈ సినిమాలో సీత పాత్ర కోసం దాదాపుగా 9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కి 90 లక్షలు పారితోషకంగా అందుకున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రేయశరన్ ఆర్ఆర్ఆర్ లో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రేయ సరోజినీ పాత్రలో చేస్తున్న శ్రేయకు ఇండస్ట్రీ టాక్ ప్రకారం 5 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేసిన సినిమాలన్నీ తన తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ కధలతోనే చిత్రీకరిస్తున్నారు. అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ 'కు దర్శకత్వం చేసినందుకు సినిమా రిలీజ్ అయినప్పుడు నుండి 30 పర్సెంట్ షేర్ రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ రోల్ చేస్తున్న హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఈ సినిమాకి ఆమె కోటి రూపాయలు పారితోషికం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: