తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్. ఆయన హీరోగా నటించిన శివయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి మోనికా బేడీ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించి 1998 మార్చి 27న విడుదల చేశారు. ఈ సినిమాకి మొఘల్ డాక్టర్ డి రామానాయుడు ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా నిర్మించారు. అలాగే ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేష్ వర్మ అద్భుతంగా చిత్రీకరించారు.

ఈ సినిమాకి ఎం ఎం శ్రీలేఖ మంచి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో నటి సంఘవి కూడా నటించారు. ఈ మూవీని 100డేస్ ఆడి ఆ రోజుల్లో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. అయితే శివయ్య సినిమా రిలీజ్ అయినా రోజే రాజేంద్రప్రసాద్ నటించిన ఆల్ రౌండర్ మూవీ విడుదలైంది. ఈ సినిమాకి టి ప్రభాకర్ డైరెక్ట్ చిత్రీకరించారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏవరేజ్ గా నిలిచింది. ఇక మార్చి 14న వన్ మ్యాన్ ఆర్మీ సినిమా విడుదల అయ్యింది. సుమన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

అంతేకాదు.. శివయ్యకు వారం ముందు మార్చి 20న రిలీజైన మావిడాకులు మూవీలో జగపతి బాబు, రచన, ఆమని నటించారు. ఈ సినిమాను ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించగా ఏవరేజ్ గా రాణించింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ వారెవ్వా మొగుడా మూవీ కథ, కధనం ఆకట్టుకోక పోవడంతో ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ సినిమాకి కె రంగారావు దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ నటించిన నిధి సినిమా ఏప్రియల్ 4న  విడులైంది. ఈ సినిమాను ఎస్వీ ఎస్ ప్రసాద్ చిత్రీకరించిన బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే శివయ్య తర్వాత 13రోజులకు మెగాస్టార్ చిరంజీవి, రంభ నటించిన బావగారు బాగున్నారా మూవీ వచ్చి సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: