ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ రష్మిక మందన్నల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ సినిమా పుష్ప. సుకుమార్ తీసిన ఈ భారీ పాన్ ఇండియా సినిమాని నవీన్ ఎర్నేని, రవిశంకర్ మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మించగా నెగటివ్ పాత్రల్లో అనసూయ, ధనుంజయ, సునీల్, ఫహద్ ఫాసిల్ నటించారు.

అల్లు అర్జున్, పుష్ప రాజ్ అనే ఊర మాస్ పాత్ర చేసిన ఈ సినిమాని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి మంచి టాక్ ని సొంతం చేసుకున్న పుష్ప మూవీ, ఆపైన అనేక ప్రాంతాల్లో మంచి కలెక్షన్ ని రాబట్టడంతో పాటు అటు నార్త్ లో కూడా బాగా అదరగొట్టింది. ముఖ్యంగా అక్కడ అల్లు అర్జున్ యాక్టింగ్ తో పాటు సుకుమార్ టేకింగ్ కి అందరి నుండి బాగా రెస్పాన్స్ వస్తోంది. ఇక దాదాపుగా 22 రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన పుష్ప మూవీని మొన్న రాత్రి ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా నాలుగు సౌత్ భాషల్లో రిలీజ్ చేసారు.

ఇక ఈ సినిమాని ఓటిటి లో చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పలువురు ప్రేక్షకాభిమానులు ప్రస్తుతం పుష్ప కి బ్రహ్మరథం పడుతున్నారని, రాబోయే మరికొద్దిరోజుల్లో ఈ సినిమా భారీ వ్యూస్ అందుకున్న మూవీగా రికార్డు ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ముఖ్యంగా సినిమాని థియేటర్స్ లో చూసినప్పటికీ కూడా పలువురు ఓటిటిలో చూస్తున్నట్లు సమాచారం. మొత్తంగా అటు థియేటర్స్ తో పాటు ఇటు ఓటిటిలో కూడా అదరగొడుతూ దూసుకెళ్తున్న పుష్పతో హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరింత గొప్ప క్రేజ్, ఇమేజ్ తో పాటు పాన్ ఇండియా హీరోగా భారీ మార్కెట్ ని కూడా సొంతం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: