సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిల్లో చాలా మంది కూడా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు.తద్వారా సినిమాలు మరియు సీరియళ్లు అలాగే షోలలో అవకాశాలను అందుకుంటూ తమ హవాను చూపిస్తున్నారు. ఇలా చాలా కాలం క్రితమే ఎంతో ఫేమస్ అయిన బ్యూటీ అషు రెడ్డి. ఈమె కొంత కాలంగా అటు సోషల్ మీడియాలోనూ ఇటు ఇండస్ట్రీలోనూ బాగా హల్‌చల్ చేస్తోంది.ఫలితంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ బ్యూటీ ఓ ఫొటోషూట్ చేసిందట. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయని తెలుస్తుంది.ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి అలాంటి ప్రయోగమే చేసిందట అషురెడ్డి.దీనికి సంబంధించిన వీడియోను  యాంకర్ రవి షేర్ చేశాడు అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


అప్పట్లో విపరీతంగా ట్రెండ్ అయిన డబ్‌స్మాష్ వీడియోల ద్వారానే అషు రెడ్డి బాగా ఫేమస్ అయింది. స్టార్ హీరోయిన్ అయిన సమంత పోలికలతో ఉన్న ఆమెను అందరూ జూనియర్ సామ్ అనేవాళ్లట. దీంతో ఈ బ్యూటీ లక్షల్లో ఫాలోవర్లను సంపాదించుకుందని తెలుస్తుంది.. ఈ క్రమంలోనే 'ఛల్ మోహనరంగ' అనే మూవీ ఛాన్స్ ఆమెకు వచ్చింది.ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరోసారి బాగా సందడి చేసేసింది.

అషు రెడ్డి కొంత కాలంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు కనిపించిన ఈ బ్యూటీ అతడితో డేట్‌కు వెళ్లడం పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తూ ఉండేది.ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్వాట కొనసాగిస్తున్నట్లు కలరింగ్ కూడా ఇచ్చింది.
ఈ మధ్య అషు రెడ్డి వరుస ఆఫర్లతో రాకెట్ లా దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే 'కామెడీ స్టార్స్' షోలో రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరి టీమ్‌లో ఆమె స్కిట్లు చేస్తోంది. అదే సమయంలో 'హ్యాపీ డేస్' అనే షోతో యాంకర్‌గా కూడా మారింది. ఇందులో ప్రస్తుతం యాంకర్ రవితో కలిసి ఆమె సందడి చేస్తోంది. వీటితో పాటు అషు రెడ్డి కొన్ని స్పెషల్ ఈవెంట్లు మరియు షోలలో కనిపిస్తూ రచ్చ చేస్తోంది.

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే హడావిడి అంతా ఇంతా కాదట. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ కూడా టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ పోస్టులు కూడా పెడుతోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంటోంది.

అషు రెడ్డి ఈ మధ్య కాలంలో అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు మరియు వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ హాట్ టాపిక్ మారింది.. ఇందులో భాగంగానే ఇటీవలే క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోషూట్‌ను కూడా షేర్ చేసింది. ఇందులో ఆమె కింద కూర్చుని ఉన్న ఫొటోలపై విమర్శలు వచ్చాయి. అంతేకాదు వీటిపై మీమ్స్ క్రియేట్ చేసి మరీ కొందరు నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు.తాజాగా యాంకర్ రవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. అందులో హ్యాపీ డేస్ షోలో గ్యాప్‌లో అషు రెడ్డి లంగావోణీలో ఫొటోషూట్ చేస్తున్నదని చూపించాడు. అంతేకాదు, 'ఇది సార్ అరాచకం.. ఈ ఫోజులేంటో కానీ మేడం ఈ డ్రెస్ మీద కూడా ఆ ఫోజులేంటి మేడం? చెప్పొచ్చుకదరా నువ్వైనా మంచి ఫోజులు పెట్టమని' అంటూ కెమెరామెన్‌కు క్లాస్ పీకేశాడట రవి.

అంతేకాదు, యాంకర్ రవి 'సోషల్ మీడియాలో మీ ఫొటోలకు పిచ్చ పిచ్చ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు' అని అన్నాడట.దీనికి పక్కనే ఉన్న అషు రెడ్డి అసిస్టెంట్.. 'మీమ్స్ పెట్టాలనే కదా.. ఈ ఫొటోలు అప్‌లోడ్ చేసేది' అంటూ ఆమె బాగోతం బయటపెట్టేశాడట ఆ తర్వాత అషు రెడ్డి ఫొటోలు చూస్తూ 'మరో దరిద్రం రెడీ అయింది' అంటూ ఆమె గాలి తీసేశాడట యాంకర్ రవి.

మరింత సమాచారం తెలుసుకోండి: