సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు అయిన రమేష్ బాబు(56) కొద్ది సేపటి క్రితం అనారోగ్యంతో కన్నుమూసారు. కొంతకాలంగా లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలించే సమయంలోనే చనిపోయినట్టు సమాచారం.

1965 అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ మరియు ఇందిరాలకు మొదటి సంతానంగా జన్మించారు ఘట్టమనేని రమేష్ బాబు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన 'అల్లూరి సీతారామరాజు' సినిమాతో పరిచయం అయ్యారట రమేష్ బాబు. ఆ తర్వాత కృష్ణ నటించిన పలు సినిమాల్లో హీరో చిన్ననాటి వేశాల్లో నటించి మెప్పించారు రమేష్ బాబు. ముఖ్యంగా 'మనుషులు చేసిన దొంగలు', 'దొంగలకు దొంగ,' 'అన్నాదమ్ముల సవాల్' వంటి చిత్రాల్లో చిన్పప్పటి హీరో పాత్రల్లో కూడా నటించాడు రమేష్ బాబు

దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో వచ్చిన 'నీడ', 'పాలు నీళ్లు' చిత్రాల్లో నటించిన రమేష్ బాబు వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'సామ్రాట్'తో హీరోగా ఆయన పరిచయం అయ్యారు. తొలి చిత్రం 'సామ్రాట్'తో మంచి విజయాన్ని అందుకున్న రమేష్ బాబు ఆ తర్వాత ఈయన 'చిన్ని కృష్ణుడు', బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్' 'ముగ్గురు కొడుకులు' మరియు కృష్ణ గారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, ఆయుధం వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు..


1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్‌కౌంటర్' చిత్రంలో చివరసారిగా కనిపించారు. ఆ తర్వాత రమేష్ బాబు చిత్రంలో నటించలేదు. హీరోగా కెరీర్ ముగిసాక.. మహేష్ బాబు హీరోగా కృష్ణ ప్రొడక్షన్స్ హౌస్ స్థాపించి.. 'అర్జున్' 'అతిథి' చిత్రాలను తెరకెక్కించాడు. అంతేకాదు 'దూకుడు' 'ఆగడు'వంటి చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించాడు.

అయితే రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తుండగా, ప్రస్తుతం కోవిడ్‌తో బాధపడుతున్న మహేష్ బాబు తన అన్నను కడసారి చూపు చూసేందుకు వెళతాడా అనే ప్రశ్న అందరి మనుసులో ఉందట.. మూడు రోజుల క్రితం మహేష్‌కి కరోనా సోకగా ఆయన ఈ విషయం తెలియజేస్తూ కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని అలాగే కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కోవిడ్‌ టెస్ట్‌లు చేయించుకొని జాగ్రత్తగా ఉండండి అని పేర్కొన్నాడు‌. అన్న మృతితో తీవ్ర విషాదంలో ఉన్న మహేష్ తగు జాగ్రత్తలు తీసుకొని చివరి చూపు చూసేందుకు వెళతాడేమోనని పలువురు భావిస్తున్నారట. మరి చూడాలి ఎం జరుగుతుందో…!

మరింత సమాచారం తెలుసుకోండి: