తెలుగు సినిమా లలో కొత్త హీరో, హీరోయిన్లకు కొదవలేదు.తాజాగా మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు..తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, ఆయన సోదరుడు శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు ఆశిష్‌.ప్రొడ్యూసర్ శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన 'రౌడీ బాయ్స్' ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన పోస్టర్లు, టీజర్స్ జనాలకు ఆసక్తిని పెంచాయి.


తాజాగా మరో బిగ్ అప్డేట్ ను వదిలింది చిత్రబృందం. జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రౌడీ బాయ్స్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. హీరో ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ మధ్య లవ్ బాండింగ్ చాలా అద్భుతంగా ఉందని ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. కాలేజీ లైఫ్ అలాగే పల్లెటూరులో కొన్ని సన్నివేశాలు ఈ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి.. మొత్తానికి ఈ సినిమాకు ఇదే హైలెట్ గా నిలుస్తుందని ట్రైలర్ ను చూస్తె ఎవరికైనా తెలుస్తుంది..


దిల్ రాజు బ్రాండ్ వాల్యూ ట్రైలర్ లో కనిపించగా రొమాన్స్ టచ్ ఇచ్చిన లవ్ స్టోరీ, కాలేజ్ లైఫ్ గొడవలతో ఈ కథ నడవనుంది. హీరో కంటే రెండేళ్లు ఏజ్ పెద్దదైన హీరోయిన్ ను ప్రేమించే యువకుడిగా హీరో ఆశిష్ ను చూపించనుండగా మెడికోగా అనుపమ పరమేశ్వరన్ పర్ఫామెన్స్ కూడిన పాత్రగా కనిపిస్తుంది. కాగా, ఇంతకాలం కాస్త రొమాన్స్ కు దూరంగా ఉన్న అనుపమ రౌడీ బాయ్స్ కోసం లిప్ లాక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: