ఈ రోజుల్లో మద్యం తాగడం ఆడవాళ్ళకు కూడా సరదాగా మారిపొయింది.. ఇటీవల నిర్వహించిన డ్రంక్‌ అండ్ డ్రైవ్ కేసులో ఎక్కువగా ఆడవాళ్ళ ఉండటం విశేషం అనే చెప్పాలి అయితే సినిమా హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫిట్‌నెస్‌, అందం అంటూ ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. అయితే ఇప్పుడు టాప్ మోడల్స్ , హీరోయిన్లు కూడా వాటిని యాడ్ లు ఇస్తున్నారు.డబ్బులు కోసం వాళ్ళు చేసే యాడ్స్ అందరినీ ఆకర్షించింది. మరోవైపు విమర్శలు కూడా అందుకున్నారు.


సినిమాలతో మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ఏవి కాకూండా సోషల్ మీడియా లో పైడ్ ప్రమోషన్స్ అని, కొలాబరేషన్స్ అని ప్రొడక్ట్స్ కి ప్రచారం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నారు. ఇటీవల కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే లు చేసిన వాటికి జనం చిర్రెత్తిపొయారు. ఇప్పుడు మరో బ్యూటీ అదే పని చేసింది.తాజాగా బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్.. టోకి.. హౌస్ ఆఫ్ సుంటోరీ కంపెనీ తో కొలాబరేషన్ అయ్యి జపనీస్ బ్లెండెడ్ సుంటోరీ విస్కీని ప్రమోట్ చేసింది.


ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానుల తో పంచుకుంది.. విస్కీ బాటిల్.. మందు గ్లాస్.. మంచింగ్ తో సహా అమ్మడు పోజ్ ఇస్తూ హౌస్ ఆఫ్ సుంటోరీ కంపెనీ తో కలవడం తనకు చాలా సంతోషం గా ఉందని తెలిపింది. అంతే కాకుండా ఈ విస్కీ తాగడం జపాన్ లో ట్రెడిషన్ అని, టోకి అంటే జపనీస్ లో టైమ్ అని అర్థమని చెప్పుకొచ్చింది. ఈ కొత్త ఏడాది తాను జపనీస్ విస్కీతోనే మొదలుపెట్టినట్లు తెలిపింది.. చివరగా మందుబాబులకు హెచ్చరిస్తున్నారు. 25 సంవత్సరాలు పైబడిన వారికే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడి పై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఇది సోషల్‌మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: