కొన్ని సినిమాలు కొన్ని సంవత్సరాల క్రిందట షూటింగ్ చేసుకుని కొన్ని అనివార్య కారణాలవల్ల విడుదల చేయకుండా ఉంటారు చిత్రబృందం.. అలా ఇప్పుడు తాజాగా దగ్గుబాటి రానా రెజీనా కలిసి నటించిన చిత్రం..1945 అనే సినిమా కూడా ఒకటి. ఇందులో మరొక నటుడు సత్యరాజ్ కూడా నటించారు.. ఇక ఈ సినిమాలో డైరెక్టర్ సత్య శివ తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుని.. నాలుగు సంవత్సరాలు పూర్తి కావచ్చిందట. కానీ అప్పటి నుంచి కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోతూ ఉండేదట.. కానీ మొత్తానికి అడ్డంకుల్ని దాటుకొని జనవరి 7వ తేదీన ఈ సినిమా విడుదలైంది.సినిమా నటన పరంగా, కామెడీ పరంగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది నట్లు తెలుస్తోంది. కేవలం ఈ సినిమాని కొన్నిచోట్ల నైట్ షో లు.. మాత్రమే ప్రదర్శించబడ్డాయి.. అయినా కూడా ఈ సినిమా హౌస్ఫుల్ బోర్డు తో ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్ల విషయానికి వస్తే..
1). నైజాం-13 లక్షలు.
2). సీడెడ్-6 లక్షలు.
3). ఆంధ్రప్రదేశ్ మొత్తం కలెక్షన్లు..11 లక్షలు.
4). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని కలెక్షన్ల విషయానికి వస్తే..30 లక్షల వరకు చేసినట్లు సమాచారం.
5). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్..7 లక్షలు.
6). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..37 లక్షల రూపాయలను వసూలు చేసింది.

సినిమా ని నిర్మాత సి.కళ్యాణ్ చాలా వరకు తనే స్వయంగా విడుదల చేస్తున్నారు.. ఈ సినిమా  సేఫ్ గా బయట పడాలంటే దాదాపుగా.1.25 కోటి రూపాయల రాబట్ట వలసి ఉంటుంది. ఇక మొదటి రోజు ఈ సినిమా ముప్పై ఏడు లక్షల రూపాయలను రాబట్టింది.. అయితే ఇంకా మరికొన్ని చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి వాటి లెక్కలు ఇంకా బయటికి రాలేదట.. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలంటే కోటి రూపాయలకు పైనే కలెక్షన్లు రాబట్టాలి.. ఇక ఇప్పటి వరకు విడుదలైన శ్యామ్ సింగరాయ్, అఖండ, పుష్ప సినిమాలు ఈ సినిమా కంటే మంచి టాక్ తో ముందుకు వెళుతున్నాయి.. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: