నాగార్జున ని మన్మధుడు అని సినీ ఇండస్ట్రీలో ఊరికే ఎవరు పిలవరు.. 60 సంవత్సరాల వయసు దాటినా ఇప్పటికీ ఇంకా యువ హీరో మాదిరి నటిస్తూ ఉన్నారు కనుక ఆయనని అలా పిలుస్తూ ఉంటారు.. అయితే ఇప్పుడు తాజాగా తన కుమారుడితో కలిసి బంగార్రాజు మూవీ లో నటించడం గమనార్హం.. ఇక ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయనాకి.. పార్ట్-2 గా నిలిచింది.. అయితే ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు సైతం తప్పుకోగా.. నాగార్జున మాత్రం ఖచ్చితంగా ఈ పండుగకు విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు.. ఎందుకంటే 2016 సంక్రాంతి కి సోగ్గాడే చిన్ని నాయనా సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. అందుకోసమే ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయనున్నారు.. అయితే ఈ సినిమాపై డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది అవేంటో చూద్దాం..


బంగార్రాజు సినిమా కొద్ది సేపటి క్రితమే..  సెన్సార్ కు సంబంధించి ఫార్మల్ ని క్లియర్ చేయడం జరిగిందట.. ఇదే ఈ సినిమా గురించి ఒక మీడియా వేదికలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. నాగ చైతన్య నాగార్జున ఇద్దరు చివరి వరకు ఈ సినిమాలో కనిపిస్తారని తెలియజేశారు. బంగార్రాజు సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమా కంటే పెద్ద హిట్ అవుతుందని, ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకుల స్పందన కోసం నేను చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నా అని కళ్యాణ్ తెలియజేయడం జరిగింది.

ఇక ఈ సినిమాని జి స్టూడియోస్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియో వారు కలిసి సంయుక్తంగా నిర్మించారు.. ఇక ఇందులో లో ఎంతోమంది కథానాయకులు కూడా నటిస్తు న్నారు.. అందులో ముఖ్యంగా రమ్య కృష్ణ, కృతి శెట్టి ప్రధాన కథానాయకులు.. ఇక అంతేకాకుండా మీనాక్షి దీక్షిత్, సిమ్రత్ కౌర్, ఫరియా అబ్దుల్లా, మరికొంతమంది నటి నటులు నటిస్తున్నారు. ఈ సంక్రాంతికి నాగార్జున దేహ ఆని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: