చెట్టంత కొడుకు కళ్ల ముందు కన్నుమూస్తే ఆ తండ్రికి అంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు. దురదృష్టవశాత్తు తెలుగు ఇండస్ట్రీలో కొందరు సినీ ప్రముఖులకు ఇలాంటి దారుణమైన పరిస్థితి కల్పించాడు ఆ దేవుడు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు అయిన రమేష్ బాబు కూడా కన్నుమూసారు.ఈయన కేవలం 56 సంవత్సరాలు వయసులోనే అనారోగ్యంతో మరణించారు. వివాద రహితుడుగా ఉన్న రమేష్ బాబు మరణం అందర్నీ బాధపెట్టింది.ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ పరిస్థితి తలుచుకుని అందరూ బాధ పడుతున్నారు.


 సీనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ చాలా చిన్న వయసులోనే అరుదైన వ్యాధి వచ్చి అనారోగ్యంతో మరణించాడు.. రామకృష్ణ మరణించినపుడు ఇరుగు పొరుగు షూటింగ్‌లో ఉన్నారు అన్నగారు. అయినా కూడా అక్కడ షూటింగ్ పూర్తి చేసి మరి ఇంటికి వచ్చారు. రామకృష్ణ మరణించిన విషయం జీర్ణించుకోడానికి చాలా రోజులు పట్టింది పాపం ఈయనకు. ఆ తర్వాత పుట్టిన కొడుకు రామకృష్ణ జూనియర్ అని నామకరణం చేసుకున్నాడట. అలాగే నందమూరి కుటుంబంలోనే హరికృష్ణకు కూడా పుత్రశోకం తప్పలేదని తెలుస్తుంది.. ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన విషయం అందరికి తెలిసిందే.విధి విచిత్రం ఏంటంటే కొడుకు చనిపోయిన నాలుగేళ్లకు తండ్రి హరికృష్ణ కూడా అదే యాక్సిడెంట్‌లోనే కన్నుమూశారు.



 ఇక సీనియర్ రైటర్ అయిన పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రఘు బాబు కూడా అనారోగ్యంతో మరణించాడు. ఈయన గురించి చాలా మందికి అస్సలు తెలియకపోవచ్చు కానీ ఇప్పటికీ పరుచూరి బ్రదర్స్ తమ వారసుడి పేరు మీద నాటక వారోత్సవాలు నిర్వహిస్తు వుంటారు.సీనియర్ నటుడు అయిన కోట శ్రీనివాసరావుకు కూడా పుత్ర శోకం తప్పలేదు.ఆయన కొడుకు కోట ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో కన్నుమూసాడు.. గాయం 2 సినిమాలో కొడుకు డెత్ సీన్ చేసిన వారం రోజుల్లోనే నిజంగానే ఆయన చనిపోవడం అందర్నీ బాగా కలిచివేసింది.మరో సీనియర్ నటుడు అయిన బాబు మోహన్ కొడుకు పవన్ కుమార్ కూడా యాక్సిడెంట్‌లోనే కన్నుమూసాడు.హీరో అవుతాడని కలలు కన్న కొడుకు అలా నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి బాబు మోహన్ పాపం తట్టుకోలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: