బాలీవుడ్ లో 1920 సినిమాతో పరిచయమైన అదా శర్మ తెలుగులో పూరీ డైరక్షన్ లో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అదా శర్మ కుర్రాళ్లని అలరించింది. అయితే కెరియర్ లో సరైన కథలు ఎంపిక చేసుకోలేని అమ్మడు వచ్చిన ప్రతి అవకాశం చేస్తూ వెళ్లే సరికి వెనకపడ్డది. అయితే సినిమాలు చేసినా చేయకపోయినా అదా శర్మ క్రేజ్ తెచ్చుకుంటుంది. అదెలా అంటే అమ్మడు సోషల్ మీడియా హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది.

అదా శర్మ సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్లకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని ఏమాత్రం నిరాశపరచకుండా అమ్మడి అందాల విందు ఉంటుంది. లేటెస్ట్ గా అద్దంలో అందాలని చూసుకుంటూ తను మురిసిపోతూ ప్రేక్షకులను మురిపిస్తుంది అమ్మడు. బ్లాక్ శారీలో అదా మిర్రర్ ముందు అందాల ప్రదర్శన చేస్తుంది. తానే చేసినా అదో అద్భుతమే అనే ఫ్యాన్స్ ఉన్నప్పుడు అమ్మడు ఇంకా రెచ్చిపోతుంది.

సినిమా ఛాన్సులు ఎలా ఉన్నా వాటికి ఏమాత్రం సంబంధం లేకుండా అదా శర్మ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. తెలుగులో పెద్దగా అవకాశాలు లేని అదా శర్మ బాలీవుడ్ లో మాత్రం వరుస ఛాన్సులు వస్తున్నాయి. అయితే తెలుగులో కూడా అదా రాణించాలని చూస్తుంది. అందుకే ఇక్కడ వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవాలని అనుకోవడం లేదు. సోషల్ మీడియాలో అదా శర్మ చేస్తున్న ఈ అందాల విందు ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. మరి అమ్మడు. లాస్ట్ ఇయర్ తెలుగులో క్వశ్చన్ మార్క్ అనే సినిమా చేసిన అదా శర్మ ఓ రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. తప్పకుండా తెలుగులో మళ్లీ అమ్మడు పుంజుకోవాలని చూస్తుంది. అలాంటి ఛాన్స్ అదా శర్మకి రావాలని ఆమె ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: